తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలోని ఇంట్రో సాంగ్ ‘వాతీ కమింగ్’
దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఆ సాంగ్‌లోని లిరిక్స్, డ్యాన్స్ స్టెప్పులను చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ అనుకరిస్తున్నారు. భుజం కదుపుతూ విజయ్ చేసిన మూమెంట్‌కు విశేషాదరణ లభించింది.
శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో వికెట్ తీసిన ఆనందంలో చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్
డ్వేన్ బ్రావో కూడా ‘వాతీ కమింగ్’ డ్యాన్స్ చేసి అలరించాడు. మైదానంలో బ్రావో స్టెప్పులకు పక్కనే ఉన్న అంబటి రాయుడు పడిపడి నవ్వుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లతో పాటు చాలా మంది క్రికెటర్లు ఈ పాటకు డ్యాన్స్ చేశారు.
Bravo done a fav step of vaathi in yesterday Csk match…… @actorvijay @DJBravo47 @ChennaiIPL pic.twitter.com/vx2n5YTDRl
— Thalapathy Basha OTFC MASTER (@ThalabathyBasha) April 16, 2021