రికీ భుయ్ అజయ్ సెంచరీ
బ్యాటర్లంతా సమిష్టిగా కదం తొక్కడంతో నార్త్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ భారీ స్కోరు చేసింది. శుక్రవారం రెండో రోజు రికీ భుయ్ (103 నాటౌట్) శతక్కొట్టడంతో సౌత్‌జోన్ 630/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ హనుమ విహారి (134), రోహన్ (143) సెంచరీలతో ఆకట్టుకోగా.. బాబా ఇంద్ర జిత్ (65), మయాంక్ అగర్వాల్ (49), కృష్ణప్ప గౌత్ (48), రవితేజ (42) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో మయాంక్ డాగర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
- సౌత్‌జోన్ 630/8 డిక్లేర్డ్
- నార్త్‌జోన్‌తో దులీప్ ట్రోఫీ సెమీస్
సేలం: బ్యాటర్లంతా సమిష్టిగా కదం తొక్కడంతో నార్త్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ భారీ స్కోరు చేసింది. శుక్రవారం రెండో రోజు రికీ భుయ్ (103 నాటౌట్) శతక్కొట్టడంతో సౌత్‌జోన్ 630/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ హనుమ విహారి (134), రోహన్ (143) సెంచరీలతో ఆకట్టుకోగా.. బాబా ఇంద్ర జిత్ (65), మయాంక్ అగర్వాల్ (49), కృష్ణప్ప గౌత్ (48), రవితేజ (42) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో మయాంక్ డాగర్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్‌జోన్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. యష్ ధుల్ (8), మనన్ వోహ్రా (11) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య కోయంబత్తూర్‌లో జరుగుతున్న మరో సెమీస్‌లో వెస్ట్‌జోన్ భారీ ఆధిక్యం సాధించింది. బౌలర్ల హవా సాగుతున్న పోరులో ఓపెనర్ పృథ్వీ షా (104 నాటౌట్) మెరుపు సెంచరీతో ప్రస్తుతం వెస్ట్‌జోన్ 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
వెంకటేశ్ అయ్యర్‌కు గాయం..
దులీప్ ట్రోఫీలో భాగంగా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డాడు. వెస్ట్‌జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఫీల్డర్ వేసిన త్రో నేరుగా వెంకటేశ్ తల భాగంలో తగలడంతో మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది గ్రౌండ్లోకి అంబులెన్స్ తీసుకురాగా.. కాసేపటికి కోలుకున్న అయ్యర్ నడుచుకుంటూ మైదానం వీడాడు. వైద్య సాయం అనంతరం తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేశ్ 14 పరుగులు చేసి ఔటయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

