హైదరాబాద్, ఆట ప్రతినిధి : సొంతగడ్డపై జరుగుతున్న 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ జట్టు.. 25-42తో పంజాబ్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తొలి మ్యాచ్‌లో రాణించిన రైడర్లు.. పంజాబ్‌తో పోరులో నిరాశపరిచారు. గురువారం లీగ్ దశ పోటీలు ముగియగా రైల్వేస్, హర్యానా క్వార్టర్స్‌కు దూసుకెళ్లాయి. ఆ రెండింటితో పాటు మధ్యప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి.