బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌కి సిద్ధమైంది. కరోనా వలన జూలైలో ప్రారంభం కావలసిన ఈ షో సెప్టెంబర్‌కి వాయిదా పడిందని అంటున్నారు.సీజన్5 కి సంబంధించి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జూమ్ ద్వారా కంటెస్టెంట్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్టు టాక్.
సీజన్ 5కి హోస్ట్‌గా నాగార్జుననే ఉంటారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాని అందులో నిజం లేదని ఈ సారి బిగ్ బాస్ షోని రానా హోస్ట్ చేయనున్నాడని అంటున్నారు. నాగార్జున తన సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వలన ఆ బాధ్యతను రానాకి అప్పజెప్పినట్టు టాక్. ఇప్పటికే రానా బుల్లితెరపై నెం 1 యారి అనే షోకు హోస్ట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన విరాట పర్వం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.