పండుగ వేళ.. ఊరెళ్తున్నారా.. జాగ్రత్త

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
అపరిచితులను నమ్మొద్దని సూచన
సమాచారమిస్తే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా
ప్రజలకు అందుబాటులో ఫోన్ నెంబర్లు
సిద్దిపేట టౌన్, జనవరి 12 :
సంక్రాంతి పర్వదినం సందర్భంగా సంబురాలు చేసుకునేందుకు జనమంతా ఊళ్లబాట పడుతున్నారు. ఊరికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని గల్లీగల్లీల్లో పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఊళ్లకు వెళ్లేవారి ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడ నిఘా ముమ్మరం చేస్తున్నారు. గతంలో సంక్రాంతికి చో రీల కోసం వచ్చిన ముఠాలు, దొంగలపై నిఘా పెట్టడంతోపాటు వారి కదలికలను పసిగడుతున్నా రు. ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణా లు, నగదు ఉంచొద్దని పోలీసు సూచిస్తున్నారు.
ఇవి పాటించండి..
రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరిగే వారిపై కన్నేసి, పోలీసులకు సమాచారమివ్వాలి.
శివారుకాలనీల్లో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తమవ్వాలి.
ఉదయం, రాత్రి వేళల్లో పేపరు, ఖాళీ సంచులు, పూలమొక్కలు తదితర వస్తువులు విక్రయించే వారిపై నిఘా ఉంచాలి.
విలువైన వస్తువులు పక్కింటి వారికి ఇచ్చి మోసపోవద్దు. ఇరుగుపొరుగు వారిని ఇంటిని కనిపెట్టమని చెప్పి వెళ్లాలి. పక్కింటి వారి ద్వారా ఇంటి సమాచారాన్ని ఎప్పటిప్పుడు తెలుసుకోవాలి. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని, ఇంటికి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
ఇంట్లో ఒంటరిగా ఉండే, వృద్ధులు అపరిచితులతో దూరంగా ఉండాలి. వారిని ఇంట్లో రానీయకుండా చూడాలి.
ఖరీదైన వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే సురక్షితం.
పండుగకు ఊరెళ్లే వారు ముందస్తుగా సమీప పోలీసు స్టేషన్లో సమాచారమివ్వాలి.
అనుమానాస్పద వ్యక్తులు, కొత్త వారి కదలికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అనుమానితులుగా అనిపిస్తే, వెంటనే డయల్"100’కు డయల్ చేసి, పోలీసులకు సమాచారమివ్వాలి.
బయటకు వెళ్లే వారు ఇంటి తాళాలను ఒకటికి రెండు సార్లు పదిలంగా చూసుకోవాలి. దూర ప్రాంతాలకు వెళ్లే వారు పూర్తి అడ్రస్‌ను ఆయా సర్కిల్ పరిధి పోలీసు అధికారులకు ఇస్తే పోలీసులు రిజిస్టర్లో నమోదు చేసుకొని, ఇంటిపై ప్రత్యేకంగా నిఘా పెడుతారు.
నేరాల నియంత్రణకు గస్తీ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలి. పండుగకు తాళం వేసి ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి. త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటికొచ్చేలా చూసుకోవాలి. విలువైన వస్తువులు ఇంట్లో దాచొద్దు. ఊరికి వెళ్లే వారు సంబంధిత పోలీసుస్టేషన్లో సమాచారమిస్తే, ప్రత్యేకంగా నిఘా పెడుతాం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నేరనియంత్రణకు అన్ని ఏర్పాట్లను చేపట్టాం. సిద్దిపేట కమిషనరేట్ వాట్సాప్ నెం. 7901100100, లేదా డయల్ యువర్ 100, సిద్దిపేట ఏసీపీ 9490617009, గజ్వేల్ ఏసీపీ 8333998684, హుస్నాబాద్ ఏసీపీ 7901640468 నంబర్లలో సమాచారమివ్వాలి.
- జోయల్ డెవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్
తాజావార్తలు
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
- బీజేపీకి రెండంకెల సీట్లూ రావు.. నా మాటకు కట్టుబడి ఉన్నా!