మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 05, 2020 , 23:35:28

ఆర్టీఏలో అన్‌లిమిటెడ్‌ ఆఫర్‌

ఆర్టీఏలో అన్‌లిమిటెడ్‌ ఆఫర్‌

కంది : సుప్రీం కోర్టు సూచనల మేరకు ఈ నెల 31 వరకు అన్ని కొత్త బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రకియ పూర్తి చేసేలా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. ఇప్పటికే ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వారిని గుర్తిం చి వారికి మెసేజ్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో గురువారం కంది మండల పరిధిలోని ఆర్టీఏ కార్యాలయం లో వాహనదారులు పెద్దసంఖ్యలో రిజిస్ట్రేషన్‌ కోసం బారు లు తీరారు. అందరికీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేలా ఆర్టీఏ అధికారులు సాధారణ పని వేళల కంటే ఎక్కువ సమయం వరకు కార్యాలయంలో ఉండి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 115 వాహనాల రిజిస్ట్రేషన్‌లను అధికారులు పూర్తి చేశారు.


ముందస్తు బుకింగ్‌కు అపరమిత స్లాట్లు

వాహనదారులు వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌కు  ముంద స్తు బుకింగ్‌ చేసుకునేలా ప్రత్యేక స్లాట్లు గతంలో ఉండేవి. కానీ, స్లాట్ల సంఖ్య పరిమితిలో ఉండగా, ప్రస్తుతం ఆ స్లాట్లను భారీగా పెంచారు ఆర్టీఏ అధికారులు. ఆన్‌లైన్‌ ద్వారా తమ రిజిస్ట్రేషన్‌ తేదీని ఆ స్లాట్‌లో బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఫలానా రోజున రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌లో ముందస్తు గా తమ పేరుతో బుకింగ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పరిమితి సంఖ్యలో ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రమే గతంలో అవకాశం ఉండగా, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తూ స్లాట్ల సంఖ్య అపరిమితంగా పెంచారు. ఈ సందర్భంగా ఆర్టీఏ అధికారులు మాట్లాడుతూ.. కొన్న వాహనాలకు, ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోనివారు వెంటనే వాహనానికి సంబధించిన రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నా రు. రిజిస్ట్రేషన్‌కు ఎంత మంది వచ్చినా తాము రిజిస్ట్రేషన్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఎక్కువ పని వేళలను పొడిగించి మరీ రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేస్తామని ఉప రవాణా కమిషనర్‌ శివలింగయ్య పేర్కొంటున్నారు.


logo