ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని స్మార్ట్ ఫోన్ చేతుల్లో పట్టుకొని ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే రోజుల్లో ఉన్నాం మనం. అరగంటలో కావాల్సిన ఫుడ్ ఇంటి ముందు ఉండే రోజులు ఇవి. ప్రస్తుతం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ కాలం నడుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా కూడా ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. దీంతో ఫుడ్ డెలివరీ సంస్థలు.. రకరకాల ఆఫర్స్ పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలా.. ఆఫర్స్ తో కస్టమర్లను తమవైపునకు తిప్పుకునే సంస్థలో జొమాటో ఒకటి.
ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా.. స్పెషల్ డే ఉన్నా.. పండుగ అయినా.. పబ్బం అయినా.. జొమాటో ఓపెన్ చేస్తే చాలు.. కుప్పలు కుప్పలుగా ఆఫర్లు కనిపిస్తాయి. దీంతో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తినేయాలనిపిస్తుంటుంది. ఇప్పటికే జొమాటో ప్రో అనే ఒక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రో ఫీచర్ లో భాగంగా ప్రో మెంబర్ షిప్ తీసుకుంటే.. 40 శాతం వరకు రెస్టారెంట్లలో డైనింగ్ వద్ద డిస్కౌంట్ లభించడంతో పాటు ఆన్ లైన్ ఆర్డర్ చేస్తే మరో 30 శాతం వరకు డిస్కౌంట్ ను అందించేవారు. మొత్తం దేశవ్యాప్తంగా 25 వేల రెస్టారెంట్లలో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రోలో జాయిన్ అవ్వాలంటే.. సంవత్సరానికి 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలలకు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే.. తాజాగా ప్రో ప్లస్ అనే మరో కొత్త ఫీచర్ ను జొమాటో ప్రారంభించింది. ప్రో ప్లస్ ఫీచర్ ద్వారా అన్ని ఆన్ లైన్ ఆర్డర్స్ ను ఉచితంగా డెలివరీ చేయనున్నారు. ప్రో మెంబర్ షిప్ తో ఉన్న బెనిఫిట్స్ తో పాటు.. ఉచితంగా డెలివరీ చేయడంతో పాటు.. సర్జ్ ఫీజు ఉండదు.. డిస్టాన్స్ ఫీజు ఉండదు.
అయితే.. ప్రో ప్లస్ మెంబర్ షిప్ ను అందరు కస్టమర్లకు కాకుండా.. సెలెక్ట్ చేసిన కస్టమర్లకు మాత్రమే జొమాటో అందిస్తుంది. దానికి సంబంధించిన వివరాలను కంపెనీ సీఈవో దీపేందర్ గోయల్ ట్వీట్ చేశారు.
జొమాటో ప్రో మెంబర్ షిప్ ను ఇప్పటి వరకు 1.8 మిలియన్ల కస్టమర్లు తీసుకున్నారు. చాలామంది ఫ్రీ డెలివరీ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే.. ప్రో ప్లస్ అనే సరికొత్త మెంబర్ షిప్ ను ప్రారంభిస్తున్నాం. ఆగస్టు 2, సోమవారం సాయంత్రం 6 తర్వాత జొమాటో యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీరు కూడా ప్రో ప్లస్ మెంబర్ షిప్ కు అర్హులు కావచ్చు. అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే.. జొమాటో ఎడిషన్ బ్లాక్ క్రెడిట్ కార్డును పొందిన కస్టమర్లు అందరికి మాత్రం జొమాటో ప్రో ప్లస్ మెంబర్ షిప్ ను ఆటోమెటిక్ గా ఉచితంగా అప్ గ్రేడ్ చేస్తున్నట్టు గోయల్ ట్వీట్ చేశారు. ఇక.. సెలెక్టెడ్ కస్టమర్స్ మాత్రం ప్రో ప్లస్ మెంబర్ షిప్ ను కొనుక్కోవాలని ఆయన వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ప్రో ప్లస్ మెంబర్ షిప్ కు అర్హులు అయ్యారేమో ఒకసారి యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి.
All Zomato Edition Black credit card holders (🙋♂️) will automatically be upgraded to Zomato Pro Plus. Everybody else will need to buy the Pro Plus upgrade from the Zomato app. Fatafat le lena, baad mein shayad nahin milega.
— Deepinder Goyal (@deepigoyal) August 2, 2021