వాషింగ్టన్: మరికాసేపట్లోనే తెలుగమ్మాయి శిరీష బండ్ల చరిత్ర సృష్టించబోతోంది. అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు అమ్మాయిగా ఆమె రికార్డు సృష్టించబోతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్తో కలిసి.. స్పేస్షిప్టూ ఎయిర్క్రాఫ్ట్ యూనిటీ 22లో శిరీష నింగిలోకి వెళ్లనుంది. ఈ చారిత్రక ట్రిప్లో భాగంగా ఇద్దరు పైలట్లతో కలిపి మొత్తం ఆరు మంది భూమి ఉపకక్ష్యలోకి వెళ్లి తిరిగి రానున్నారు.
లైవ్లో చూడొచ్చు
ఈ యూనిటీ 22 నింగిలోకి దూసుకెళ్లే చారిత్రక సందర్భాన్ని లైవ్లో చూడొచ్చు. కచ్చితంగా ఇది ఎప్పుడు టేకాఫ్ అవుతుంది, ఎప్పుడు ల్యాండవుతుందన్న వివరాలు వర్జిన్ గెలాక్టిక్ ఇవ్వకపోయినా.. లైవ్ టెలికాస్ట్ మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. కంపెనీ వెబ్సైట్ virginatlantic.com లో ఈ లైవ్ టెలికాస్ట్ చూసే అవకాశం కల్పించారు. వర్జిన్ గెలాక్టిక్ ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్ చానెళ్లలో కూడా దీనిని చూడొచ్చు.
భూమికి 90 కిలోమీటర్ల ఎత్తు వరకూ వీళ్లు వెళ్లనున్నారు. అక్కడ కొన్ని నిమిషాల భార రహిత స్థితిలో ఉన్న తర్వాత తిరిగి భూమి వైపు ప్రయాణం కానున్నారు. ఈ మొత్తం ప్రయాణం 90 నిమిషాల్లో ముగుస్తుందని గతంలో బ్రాన్సన్ వెల్లడించారు.
Wake up and watch the launch of the next space age! Our crew of #Unity22 mission specialists including @RichardBranson are just hours away from our test flight launch.
— Virgin Galactic (@virgingalactic) July 10, 2021
Watch live tomorrow at 6 am PT | 9 am ET | 2 pm BST on https://t.co/5UalYT7Hjb. pic.twitter.com/mtpHIzjADa