ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్ డీపీ (డిస్ప్లే పిక్చర్)గా సొంత అవతార్స్ పెట్టుకునే వీలు కల్పించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని డబ్ల్యూఏబేటాఇన్ఫో వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా అవతార్స్‌ను డీపీగా ఎలా పెట్టుకోవచ్చో చూపించే ఒక ఫొటో బయటకు వచ్చింది.
దీంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వీడియో కాల్స్ చేసినప్పుడు కూడా ఇలాంటి యానిమేటెడ్ అవతార్లతో కాల్ మాట్లాడే వీలు కల్పించాలని వాట్సాప్ ప్రయత్నిస్తోందట.