వాట్సాప్ వాడేటప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నట్లు అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం దాచాలనుకున్నా కుదరదు. అయితే ఇకపై ఈ అవకాశం కూడా వినియోగదారులకు కల్పించాలని వాట్సాప్ ప్రయత్నిస్తోంది. దీనికోసమే ‘‘ఆన్లైన్’’ స్టేటస్‌ను దాచుకునేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
కేవలం కొంత మంది నుంచే ఈ విషయం దాచాలా? లేక ఎవరికీ కనిపించకుండా దాచాలా? అనేది కూడా మనమే నిర్ణయించుకునేలా ఈ ఫీచర్ ఉండనుందట. దీనిలో ‘‘ఎవ్రీవన్’’ లేదా ‘‘సేమ్ యాజ్ లాస్ట్ సీన్’’ అనే ఆప్షన్ ఉండబోతున్నాయి. వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవడం ద్వారా ‘‘ఆన్లైన్’’ స్టేటస్‌ను దాచుకోవచ్చు.
అంతేకాదు, ‘‘సేమ్ యాజ్ లాస్ట్ సీన్’’ ఎంచుకుంటే దీనిలో మళ్లీ ఎవ్రీబడీ, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, నోబడీ వంటి ఆప్షన్లు ఉంటాయట. ఇలా మన ఆన్లైన్ స్టేటస్‌ను ఎవరు చూడాలి? ఎవరికి కనిపించకూడదు అనే నిర్ణయం మనమే తీసుకుంటాం. త్వరలోనే ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.