WhatsApp : ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫీచర్.. వాట్సప్ లో త్వరలో రాబోతోంది
ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫీచర్ | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. అదే వాయిస్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. అదే వాయిస్ రికార్డింగ్‌లో పాజ్ ఆప్షన్. వాట్సప్ చాట్ బాక్స్‌లో వాయిస్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కదా. ఆ ఆప్షన్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే మధ్యలో ఆపే అవకాశం ఉండదు. మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా దాన్ని మధ్యలో పాజ్ చేసి మళ్లీ రికార్డు చేసే అవకాశం ఇప్పటి వరకు ఉండేది కాదు. కానీ.. త్వరలో వాయిస్ రికార్డింగ్‌లో పాజ్ ఆప్షన్‌ను తీసుకురానుంది. దాని వల్ల.. క్లీన్, షార్ట్ వాయిస్ మెసేజ్‌లు పంపించుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే వాట్సప్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. వాయిస్ రికార్డింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మధ్యలో పాజ్ ఆప్షన్ కనిపిస్తుంది. వాయిస్ రికార్డింగ్ చేస్తూ మధ్యలో పాజ్ బటన్ నొక్కి కాసేపు ఆగి మళ్లీ పాజ్ బటన్ ఆఫ్ చేసి వాయిస్ రికార్డు చేసుకోవచ్చు.
మరోవైపు చాట్ బ్యాకప్స్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను బీటా టెస్టర్ల కోసం ఇటీవలే వాట్సప్ స్టార్ట్ చేసింది. దీని కోసం యూజర్లు క్లౌడ్ ఆధారిత కీ, పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల చాట్ బ్యాకప్స్‌ను డీకోడ్ చేయడం అస్సలు కుదరదు. సంబంధిత యూజర్ మాత్రమే కీ, పాస్వర్డ్ ద్వారా చాట్ బ్యాకప్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Jio Offer | నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లకు జియో బంపర్ ఆఫర్
Telegram | వాట్సాప్ డౌన్.. పండగ చేసుకున్న టెలిగ్రామ్.. భారీగా కొత్త యూజర్లు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

