Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
Perni Nani | ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు.
అమరావతి : ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu ) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ( Perni Nani ) ఆరోపించారు. వైసీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పులివెందుల ( Pulivendula ) తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యరుథలు నామినేషన్లు వేయనీయకుండా, రిగ్గింగ్‌కు పాల్పడి విజయం సాధించారని విమర్శించారు. టీడీపీ గూండాలకు పోలీసులు బాగా సహకరించారని ఎద్దేవా చేశారు. చివరకు ఎన్నికల సంఘం కూడా పక్షపాతిగా వ్యవహరించిందని విమర్శించారు. అది ఒక గెలుపు.గెలుపేనా అంటూ నిలదీశారు. ఆవుతోలు కప్పుకున్న తోడేలుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఆయన పాపాలను అమరావతి ప్రజలు లెక్కిస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీలో చురుకైన కార్యకర్తలను పోలీసుల ఎదుట బైండోవర్ చేశారని అన్నారు. టీడీపీ గూండాలను, హంతకులు, రౌడీలను బైండోవర్ ఎందుకుచేయలేదని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్రంలో రెండు తుపాన్ల బారిన పడ్డ రైతాంగానికి ఎలాంటి సహాయం అందించలేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వమే రైతు బీమాను కట్టి విపత్తుల సమయంలో రైతులను ఆదుకున్నారని కొనియాడారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఉద్యోగాల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

