ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌లో త్వరలో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. ఇప్పటికే డిలీట్ ఫర్ ఎవరీవన్(Delete for Everyone) అనే ఆప్షన్ ఉన్న విషయం తెలిసిందే. ఎవరికైనా ఏదైనా మెసేజ్ లేదా ఫోటో, వీడియో లాంటి ఫైల్స్ పంపించినప్పుడు.. ఆ మెసేజ్‌ను తర్వాత డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఫర్ ఎవరీవన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తారు. డిలీట్ ఫర్ మీ అంటే కేవలం పంపించిన వ్యక్తి చాట్ బాక్స్‌లో మాత్రమే ఆ ఆప్షన్ డిలీట్ అవుతుంది. డిలీట్ ఫర్ ఎవరీవన్ అంటే.. ఆ మెసేజ్ పంపించిన వాళ్లందరి చాట్ బాక్స్‌లో డిలీట్ అవుతుంది.
అయితే.. డిలీట్ ఫర్ ఎవరీవన్కు కొంత టైమ్ లిమిట్‌ను పెట్టారు. ఆ టైమ్ లిమిట్లో మాత్రమే డిలీట్ ఫర్ ఎవరీవన్ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. టైమ్ లిమిట్ దాటితే వేరే వాళ్లకు పంపించిన మెసేజ్‌ను డిలీట్ చేయడం కుదరదు.
వాట్సప్‌లో డిలీట్ ఫీచర్‌ను 2017లో ప్రారంభించారు. ఆ సమయంలో టైమ్ లిమిట్ కేవలం 7 నిమిషాలు మాత్రమే ఉండేది. కొన్ని నెలల తర్వాత ఆ టైమ్ లిమిట్‌ను ఒక గంటకు సెట్ చేశారు.
త్వరలో ఆ టైమ్ లిమిట్‌ను ఎత్తేసేందుకు వాట్సప్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. మెసేజ్ పంపించిన తర్వాత ఎన్ని రోజులకు అయినా ఆ మెసేజ్‌ను డిలీట్ ఫర్ ఎవరీవన్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేసే అవకాశాన్ని కల్పించేందుకు వాట్సప్ వర్క్ చేస్తోంది.
ముందు ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లకు అందుబాటులోకి రానుంది. టెస్టింగ్ తర్వాత అందరు యూజర్లకు ఈ ఫీచర్‌ను అందించనున్నారు.
Nokia T20 : నోకియా నుంచి అద్భుతమైన ఫీచర్లతో ట్యాబ్.. ధర కూడా తక్కువే
JioPhone Next : అదిరిపోయిన జియోఫోన్ నెక్స్ట్ లుక్.. ఇదిగో వీడియో
Facebook : ఫేస్బుక్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. యాపిల్ వాచ్‌కు దీటుగా
Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?