Whatsapp | న్యూఢిల్లీ: యూజర్ల భద్రత, గోప్యతను మరింత మెరుగుపర్చేందుకు వాట్సాప్ మరో మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అకౌంట్ ప్రొటెక్ట్, డివైజ్ వెరిఫికేషన్, ఆటోమెటిక్ సెక్యూరిటీ కోడ్స్ అనే మూడు ఫీచర్లను వాట్సాప్ ప్రవేశపెట్టింది. కొత్త డివైజ్‌కు వాట్సాప్‌ను మార్చుకునేటప్పుడు పాత డివైజ్‌లో అనుమతి ఇవ్వడం తప్పనిసరి చేస్తూ అకౌంట్ ప్రొటెక్ట్ ఫీచర్ వచ్చింది.
మన ప్రమేయం లేకుండా మన ఫోన్లో మాల్వేర్ ద్వారా వాట్సాప్ నుంచి అనవసర మెసేజ్‌లు వెళ్తున్నాయా(అకౌంట్ టేకోవర్ అటాక్స్) అన్నది గుర్తించడానికి డివైజ్ వెరిఫికేషన్ ఫీచర్ పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా అటాకర్ కనెక్షన్‌ను బ్లాక్ చేయవచ్చు. ఇక, వాట్సాప్‌లో మనం పంపే మెసేజ్‌లు సురక్షితంగా అవతలివారికి వెళ్తున్నాయో లేదో గుర్తించడానికి ఆటోమెటిక్ సెక్యూరిటీ కోడ్స్ ఫీచర్ పని చేస్తుంది.