న్యూఢిల్లీ : ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాది యూజర్లు ఫాలోయర్లతో వినూత్న పద్ధతిలో కమ్యూనికేట్ చేసేందుకు చానెల్స్‌ను (WhatsApp Channels) ప్రవేశపెట్టగా తాజాగా ఈ ఛానెల్స్‌కు త్వరలో ఆటోమేటిక్ ఆల్బం ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ఛానెల్స్‌లో ఈ ఫీచర్ మీడియాను ఆర్గనైజ్ చేస్తుంది. షేర్డ్ ఆల్బమ్స్‌లో ఛానెల్ రియాక్షన్స్‌కు కూడా ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. చాట్స్‌లో పిన్ మెసేజ్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ ప్రవేశపెడుతోంది.
ఇక వాట్సాప్ చానెల్స్ ఇన్స్టాగ్రం బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ తరహాలో యూజర్లు డెడికేటెడ్ గ్రూప్స్ క్రియేట్ చేసేందుకు వెసులుబాటు కల్పిస్తుండగా అడ్మిన్ మాత్రమే కమ్యూనికేట్ చేయడంతో పాటు మెసేజ్‌లు పంపుతారు. ఇక ఫాలోయర్లు ఎమోజీలతో రియాక్ట్ అవుతుంటారు. ఇక ఆటోమేటిక్ ఆల్బం వంటి లేటెస్ట్ ఫీచర్లతో వాట్సాప్ ఛానెల్స్‌ను న్యూ అప్డేట్స్తో మెరుగుపరిచేందుకు మెటా కసరత్తు సాగిస్తోంది.
గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం ద్వారా ఈ న్యూ ఆల్బం ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తోందని వాట్సాప్ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేసే వెబ్సైట్ వేబీటాఇన్ఫో వెల్లడించింది. ఇక న్యూ ఫీచర్ ద్వారా వ్యక్తులు, గ్రూప్ చాట్స్ తరహాలో వాట్సాప్ చానెల్స్ ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఆల్బమ్‌లను క్రియేట్ చేసే వెసలుబాటు కలుగుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్ది మంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉండగా త్వరలోనే విస్తృత యూజర్లకు చేరనుంది.
Read More :