Meta to Face FTC | ఇన్‌స్టా.. వాట్సాప్ సేల్ తప్పదా.. మెటాకు ఎఫ్‌టీసీ తలనొప్పి?!
Meta to Face FTC | యాంటీ ట్రస్ట్ కేసు మెటాను చుట్టేస్తుందా.. ఎఫ్‌టీసీ పిటిషన్‌తో వాట్సాప్, ఇన్‌స్టాలను వదులుకోవాల్సి వస్తుందంటున్నారు.

Meta to Face FTC | సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుందా.. తన అనుబంధ యాప్‌లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను అమ్ముకోవాల్సిందేనా.. అంటే ఇటు మెటా.. అటు యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) వర్గాలు అవుననే అంటున్నాయి. మెటాగా ఫేస్బుక్ పేరు మార్చడంతోనే దాని సమస్య సమసిపోలేదు. యాంటీ ట్రస్ట్ పద్దతులు అవలంభిస్తున్నదని సుదీర్ఘకాలంగా మెటా (ఫేస్బుక్) అభియోగాలు ఎదుర్కొంటున్నది. చిన్న సోషల్ మీడియా సంస్థలు మనుగడ సాగించలేని పరిస్థితులు కల్పిస్తున్నదని ఆయా సంస్థలు ఫిర్యాదు చేస్తున్నాయి. తనకు పోటీగా ఇతర సంస్థలు ఎదగకుండా అడ్డుకుంటుందన్న అభియోగాలు ఉన్నాయి. ఏదైనా సంస్థ తనకు పోటీ అని ఫేస్బుక్ భావిస్తే.. తనలో విలీనమో, ఇతర సంస్థల్లో విలీనం చేయడానికో ప్రయత్నిస్తున్నదన్న విమర్శ ఉంది. యాంటీ ట్రస్ట్ విషయంలో మెటాకు వ్యతిరేకంగా ఎఫ్‌టీసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్ కోర్టును ఆమోదించింది.
కోర్టు ముందు మెటాను నిలబెట్టనున్న ఎఫ్‌టీసీ
దీని ప్రకారం మెటాను ఎఫ్‌టీసీ.. కోర్టు ముందు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సమాచారం. మెటా తన అనుబంధ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి పాపులర్ ప్లాట్‌ఫామ్స్‌ను మెటా విక్రయించాలని ఎఫ్‌టీసీ కోరుతున్నది. అమెరికాలో కన్జూమర్ల ప్రయోజనాలను కాపాడే స్వతంత్ర సంస్థ ఎఫ్‌టీసీ. యాంటీ ట్రస్ట్ అంశంపై ఎఫ్‌టీసీ దాఖలు చేసిన పిటిషన్లో వివరాల్లేవని గతేడాది న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా ఎఫ్‌టీసీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్బోస్బర్గ్ స్పందిస్తూ మెటాకు వ్యతిరేకంగా సరిపడా ఆధారాలు ఉన్నాయన్నారు. సోషల్ నెట్వర్కింగ్లో మెటా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నదని తేలిందన్నారు.
మెటా యూజర్లపై ఎఫ్‌టీసీ డేటా ఇదీ
2016 నుంచి మెటాకు డైలీ యాక్టివ్ యూజర్లు 70 శాతానికి పైగా ఉన్నారని ఎఫ్‌టీసీ పేర్కొన్నదని జడ్జి జేమ్స్ బోస్బర్గ్ అభిప్రాయ పడ్డారు. ఎఫ్‌టీసీ పిటిషన్‌ను తిరస్కరించాలన్న మెటా అభ్యర్థనను కొట్టి పారేశారు. అసలు విషయమేమిటంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎఫ్‌టీసీ చైర్మన్‌గా లీనాఖాన్ను ఎంపిక చేయడంతో మెటా కష్టాలు మొదలైనట్లు కనిపిస్తున్నది. లీనాఖాన్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని.. యాంటీ ట్రస్ట్ అంశంపై కఠినంగా వ్యవహరించాలని తలపోస్తున్నారని సమాచారం. కోర్టు ఆదేశాలు జారీ చేసినా మెటాపై ఎఫ్‌టీసీకి విజయం సాధించడం అంత తేలిక్కాదు. తాము మరింత డేటా సేకరించాల్సి ఉందని లీనాఖాన్ చెప్పారు.
ఇన్‌స్టా.. వాట్సాప్ ఇలా మెటా వశం
2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను బిలియన్ డాలర్ల (రూ.7,200 కోట్లు) కు కొనుగోలు చేసింది ఫేస్బుక్. దీన్ని ఎఫ్‌టీసీ ఆమోదం లభించిన తర్వాత కొనుగోలు చేసింది. 2014లో వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు (రూ.1.5 లక్షల కోట్లు) ఎఫ్‌టీసీ అప్రూవల్ తర్వాతే టేకోవర్ చేసింది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లను విక్రయించాలని మెటా భావించట్లేదని సమాచారం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Business news
- Meta
- us ftc
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

