Vivo Y400 5G | బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా. అయితే మీ కోసమే వివో లేటెస్ట్గా ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది, వై400 5జి పేరిట భారత మార్కెట్లో వివో ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందించడంతోపాటు ధర కూడా బడ్జెట్లోనే ఉండడం విశేషం. ఈ ఫోన్లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. సూర్యకాంతిలోనూ ఫోన్ తెర స్పష్టంగా కనిపించేలా ఈ ఫోన్‌కు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది.
ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా, మరో 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్‌కు గాను ఐపీ 68, ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఏఐ సూట్ పేరిట ప్రత్యేక ఏఐ ఫీచర్లను పొందవచ్చు. ఏఐ ట్రాన్స్క్రిప్ట్, ఏఐ సూపర్ లింక్, ఫోకస్ మోడ్ వంటి ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ కేవలం 7.9 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండి అత్యంత పలుచగా ఉంటుంది. అందువల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది.
ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అందిస్తున్నారు. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌ను కేవలం 20 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
వివో వై400 5జి స్మార్ట్ ఫోన్‌ను ఆలివ్ గ్రీన్, గ్లామ్ వైట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999గా ఉంది. ఈ ఫోన్‌ను వివో ఇండియా ఇ-స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ స్టోర్స్‌లో, ఇతర రిటెయిల్ స్టోర్స్‌లో ఆగస్టు 7 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌కు గాను ప్రీ బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించారు. ఎస్బీఐ కార్డు, డీబీఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ తదితర బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు జియో పోస్ట్ పెయిడ్ వినియోగదారులు అయితే 2 నెలల వరకు 10 ఓటీటీ యాప్‌లకు ఉచితంగా ప్రీమియం యాక్సెస్ లభిస్తుంది.