VIVO Y21T | ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తన వై-స్మార్ట్‌ఫోన్ సిరీస్ వై21టీ తాజా మోడల్‌ను ఆవిష్కరించింది. తొలి వై21టీ మోడల్ ఫోన్‌ను గతేడాది ఆగస్టులో విడుదల చేసింది. తాజాగా మీడియా టెక్ ఎస్వోసీ స్థానే క్వాల్కామ్ చిప్సెట్తో కూడిన వై21టీ ఫోన్ ఆవిష్కరించింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడా ప్రాంతంలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో ఈ ఫోన్ ఉత్పత్తి చేసింది. మేకిన్ ఇండియా ఇన్షియేటివ్‌కు కట్టుబడి వివో వై21టీ ఫోన్‌ను తయారు చేసినట్లు తెలిపింది.