Vivo V60 | ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లను కొంటున్న చాలా మంది వాటిల్లో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్నారు. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఇలాంటి ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివో కూడా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను అద్భుతమైన ఏఐ ఫీచర్లతో లాంచ్ చేసింది. వి60 పేరిట ఈ ఫోన్‌ను వివో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో ఆకట్టకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.77 ఇంచుల కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 16జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది.
ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను సైతం ఏర్పాటు చేశారు. మరో 50 మెగాపిక్సల్ 3ఎక్స్ పెరిస్కోపిక్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల సహాయంతో అద్భుతమైన దృశ్యాలను షూట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు గాను 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో అద్భుతమైన ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు. ఇవే ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. సర్కిల్ టు సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, ఎరేజ్ 2.0 వంటి ఏఐ ఫీచర్లను ఈ ఫోన్లో యూజర్లు పొందవచ్చు.
ఈ ఫోన్లో 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కేవలం 7.53 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్లలో అత్యంత పలుచని డిజైన్ కలిగిన ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఈ ఫోన్ డిస్ప్లేకు డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ ఫోన్‌కు 5000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను కూడా అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్‌ను 8జీబీ, 12జీబీ, 16జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు.
ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఐపీ 68, ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు సదుపాయలు సైతం ఇందులో ఉన్నాయి. వివో వి60 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.36,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999గా ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.40,999గా నిర్ణయించగా, టాప్ ఎండ్ మోడల్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.45,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌కు గాను ప్రీ బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించారు. ఈ ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఆన్లైన్ స్టోర్, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఆగస్టు 19 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌పై పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో 10 శాతం క్యాష్ బ్యాక్ లేదా ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచారు.