న్యూఢిల్లీ : వివో వీ25 ప్రొ ఎంట్రీ ఇచ్చిన కొద్ది వారాల అనంతరం భారత్‌లో వివో వీ 25 లాంఛ్ అయింది. ప్రొ మోడల్ తరహాలోనే లేటెస్ట్ వివో వీ25 కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌గా కస్టమర్ల ముందుకొచ్చింది. వివో వీ25 ప్రొను పోలిన డిజైన్‌తో కస్టమర్లను న్యూ 5జీ ఫోన్ ఆకట్టుకుంటోంది. స్టాండర్డ్ మోడల్లో కలర్ ఛేంజింగ్ గ్లాస్ బ్లాక్ ప్యానెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
వివో వీ25ను రూ 30,000 లోపు ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా బ్లూ, బ్లాక్ కలర్స్‌లో లభించే వివో వీ25 రూ 27,999 నుంచి అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ వివో స్మార్ట్‌ఫోన్ రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ప్రీబుకింగ్ చేసుకున్న వారికి ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకు కార్డులపై పది శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఇక వివో వీ25 స్మార్ట్‌ఫోన్ 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగిఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ఎస్ఓసీ చిప్సెట్తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అవుటాఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగిఉంది.