Vivo V23 : వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్ బీఐఎస్, ఎస్ఐఆర్ఐఎం సర్టిఫికేషన్ పూర్తి కావడంతో త్వరలో భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. 5జీ కనెక్టివిటీతో రానున్న వివో 23 వివో వీ21 5జీతో పోలిస్తే అప్‌గ్రేడెడ్ ప్రాసెసర్, మెరుగైన కెమెరా ఫీచర్స్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.
వివో వీ23 5జీ 6.44 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్ప్లేతో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో రానుంది. 44 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4050 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఇక త్వరలో రానున్న వివో వీ23 ప్రొ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. వివో వీ23 సిరీస్‌లో వివో వీ23ఈ, వివో వీ23 5జీ, వివో వీ23 ప్రొ స్మార్ట్పోన్లు రానున్నాయి.