వాషింగ్టన్: వర్జిన్ గెలాక్టిక్ ( Virgin Galactic ) తమ స్పేస్ ట్రిప్ కోసం టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది. గురువారం నుంచే ఈ టికెట్లు అమ్ముతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ చీఫ్ రిచర్డ్ బ్రాన్సన్ విజయవంతంగా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన కొన్ని వారాల వ్యవధిలోనే వర్జిన్ గెలాక్టిక్ తమ కమర్షియల్ స్పేస్‌షిప్ టికెట్ల ధర ఖరారు చేసి, అమ్మకాలు ప్రారంభించడం విశేషం. ఒక్కో సీటు ధరను 4.5 లక్షల డాలర్లు (సుమారు రూ.3.33 కోట్లు)గా నిర్ణయించారు.
గత నెల 11న న్యూ మెక్సికోలోని ఎడారి నుంచి వర్జిక్ గెలాక్టిక్‌కు చెందిన రాకెట్లో రిచర్డ్ బ్రాన్సన్ స్పేస్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. 90 కిలోమీటర్ల వరకూ పైకి దూసుకెళ్లి తర్వాత సేఫ్‌గా కిందికి దిగి వచ్చారు. ఆయనతోపాటే మన తెలుగు అమ్మాయి శిరీష బండ్ల కూడా స్పేస్‌లోకి వెళ్లి వచ్చింది. కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయని ప్రకటించగానే కంపెనీ షేర్ల ధర 5 శాతం పెరిగింది.
We are not just watching history be made, we are making it happen together. Thank you for joining us on this journey into the next era of space travel. We invite you to visit our website to register for updates and future ticket information: https://t.co/5UalYTpiHL. pic.twitter.com/eZ2cEDPpQS
— Virgin Galactic (@virgingalactic) August 5, 2021