Twitter : ట్విట్టర్ బంపర్ ఆఫర్.. తమ ఆల్గారిథమ్‌లో బగ్ గుర్తిస్తే భారీ పారితోషకం
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఆల్గారిథమ్‌లో బగ్ గుర్తిస్తే భారీ పారితోషకం
Twitter : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఆల్గారిథమ్‌లో బగ్ గుర్తిస్తే భారీ పారితోషకం ఇస్తామని ప్రకటించింది. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ భాషలో బగ్ అంటే.. ఎర్రర్ లేదా లోపం. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథమ్ లో బగ్‌ను గుర్తించి ట్విట్టర్‌కు తెలియజేయాలని హ్యాకర్లకు ట్విట్టర్ సవాల్ విసిరింది. ఏఐ ఆల్గారిథమ్ మీద ట్విట్టర్ నుంచి వచ్చిన మొట్టమొదటి కాంపిటిషన్ ఇది. త్వరలో ట్విట్టర్ హ్యాకర్ కన్వెన్షన్ డెఫ్ కాన్ ఏఐ(DEF CON AI)ని ట్విట్టర్ నిర్వహించబోతోంది. ఈసందర్భంగా ఈ సవాల్‌ను విసిరింది.

అయితే.. తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ చాలెంజ్ గురించి వెల్లడించిన ట్విట్టర్.. తమ ఆల్గారిథమ్‌లో బగ్ కనుక్కోవడం చాలా కష్టం అని పేర్కొన్నది. అందుకే.. ఇది హ్యాకర్లకు సవాల్ అంటూ వెల్లడించింది. గత మేలో కూడా ట్విట్టర్ ముఖ్యమైన ఆల్గారిథమ్ లో లోపాలు వెతకాలంటూ సవాల్ విసిరింది. అంతే కాదు.. ఆ ఆల్గారిథమ్కు సంబంధించిన కోడ్‌ను పబ్లిక్ ప్లాట్ ఫాంలో అందరికీ అందుబాటులో ఉంచింది. తాజాగా మరోసారి ఏఐ ఆల్గారిథమ్పై సవాల్ విసిరింది.
తమకు వీలైనంత బెటర్‌గా ఆల్గారిథమ్స్‌ను డెవలప్ చేసినప్పటికీ.. హ్యాకర్లు ఇందులో ఏదైనా లోపాన్ని వెతికి కంపెనీకి చెప్పాలని.. ఎవరైతే అసలైన బగ్‌ను కనిపెడతారో.. వాళ్లను విజేతలుగా హ్యాకర్ కన్వెన్షన్‌లో ప్రకటిస్తామని కంపెనీ వెల్లడించింది.
అయితే.. తమ ఎంట్రీలను ఆగస్టు 7 లోపు పంపించాలని స్పష్టం చేసింది. హ్యాకర్ వర్క్ షాపు ఆగస్టు 8న జరగనుంది. బగ్‌ను కనిపెట్టిన వాళ్లలో మొదటి బహుమతి గెలుచుకున్న వాళ్లకు 3500 డాలర్లు(2.5 లక్షలు), రెండో బహుమతి గెలుచుకున్నవాళ్లకు 1000(70 వేలు) డాలర్లు, మూడో బహుమతి గెలుచుకున్నవాళ్లకు 500(35 వేలు) డాలర్లను ఇవ్వనుంది ట్విట్టర్.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

