Twitter-ElonMusk | మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ టేకోవర్ చేయడానికి ముందుకు వచ్చారా.. అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్ల ట్రేడింగ్ నిలిపేసినట్లు వార్తలొచ్చాయి. 54.20 డాలర్లకు షేర్ చొప్పున టేకోవర్ చేయడానికి ఎలన్‌మస్క్ సిద్ధంగా ఉన్నారని ఆ వార్త సారాంశం. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ బ్లూంబర్గ్ ఒక వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్త బయటకు పొక్కడంతోనే ట్విట్టర్ షేర్లు పుంజుకున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ట్రేడింగ్ హాల్ట్ అయ్యే సమయానికి ట్విట్టర్ షేర్ 12.7 శాతం పుంజుకున్నట్లు సమాచారం. మరోవైపు, ఎలన్‌మస్క్ సారధ్యంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్ సుమారు మూడు శాతం నష్టపోయింది. ఇంతకు ముందు ప్రతిపాదించిన ఆఫర్‌కే టేకోవర్ చేస్తానని ట్విట్టర్‌కు ఎలన్‌మస్క్ లేఖ రాశారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ గానీ, ఎలన్‌మస్క్ న్యాయవాదులు గానీ అందుబాటులో లేరు.
ట్విట్టర్లో స్పామ్ ఖాతాల సంగతి తేలుస్తే దాన్ని టేకోవర్ చేస్తానని తొలుత ప్రకటించిన ఎలన్ మస్క్.. ఆ సాకుతో వెనక్కు తగ్గారు. దీనిపై ట్విట్టర్ న్యాయ పోరాటానికి దిగింది. ఈ నెల 17న డెలావర్ చాన్సరీ కోర్ట్‌లో ట్విట్టర్-ఎలన్‌మస్క్ వివాదంపై కేసు విచారణకు రానున్నది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ధరకే ట్విట్టర్‌ను టేకోవర్ చేయడానికి ఎలన్‌మస్క్ అంగీకరించారని వార్తలు రావడం గమనార్హం.
Elon Musk on Twitter | ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ `మనీ` రెడీ! ఎలాగంటే?!
Elon Musk on Twitter | ట్విట్టర్‌ను అమ్మేయండి.. కొంటా.. ఎలన్‌మస్క్ బంపరాఫర్!
Elon Musk Stocks in Twitter | ట్విట్టర్లో అతిపెద్ద వాటాదారుగా ఎలన్‌మస్క్!
Elon Musk in Twitter Board | ట్విట్టర్ బోర్డులోకి ఎలన్‌మస్క్.. ప్రకటించిన పరాగ్ అగర్వాల్!
Elon Musk on Twitter | ట్విట్టర్ కోసం మస్క్ ఆప్షన్లు ఏమిటంటే?!
Twitter on Elon Musk | ఆ ఆఫర్ బెస్ట్ అండ్ ఫైనల్.. మస్క్ ఆఫర్‌పై ట్విట్టర్..!
Twitter @ Musk | మస్క్ సొంతమైన ట్విట్టర్.. అనిశ్చితి తప్పదన్న పరాగ్
Elon Musk-Twitter | ట్విట్టర్ ఇక మస్క్ సొంతం.. ఆ మార్పులు తీసుకొస్తారా?!
Twitter Chairman Dorsey ? | ట్విట్టర్ చైర్మన్‌గా జాక్ డోర్సీ.. పరాగ్ స్థానం సురక్షితం కాదా?!
Twitter Employees to Fire | మున్ముందు ట్విట్టర్లో కొలువులకు కష్టాలేనా?!
New CEO for Twitter | ట్విట్టర్‌కు కొత్త సీఈవో పక్కా.. ఇదీ సంస్థ ప్రగతికి బ్లూ ప్రింట్ !
Twitter CEO Parag | ఎగ్జిక్యూటివ్‌పై ట్విట్టర్ సీఈవో పరాగ్ ఆగ్రహం.. ఎందుకంటే?!
Twitter Parag Agarwal wife role | ట్విట్టర్ కోసం ఎలన్‌మస్క్ ఇలా.. సీఈవో పరాగ్ అగర్వాల్ అలా..!
Twitter on Elon Musk Deal | తేల్చేసిన ట్విట్టర్ .. ఎలన్‌మస్క్ డీల్‌పై వెయిటింగ్ పీరియడ్ ఓవర్! |
Twitter Board | ఇక ఎలన్మస్క్దే ట్విట్టర్.. బోర్డు ఏకగ్రీవ తీర్మానం
Twitter-Musk | ట్విట్టర్ అంచనాలు మిస్.. ఎలన్‌మస్క్‌తో వివాదమే కారణమా?!