వాట్సప్‌లో డిలీట్ ఫర్ ఎవరీవన్ అనే ఫీచర్ తెలుసు కదా. మామూలుగా వాట్సప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపించి దాన్ని డిలీట్ చేయాలనుకుంటే.. మెసేజ్ పంపించిన ఒక గంట 8 నిమిషాల 16 సెకండ్లలోపు డిలీట్ చేయాలి. ఆలోపే డిలీట్ ఫర్ ఎవరీవన్ ఆప్షన్ పనిచేస్తుంది. ఆ సమయం దాటితే మాత్రం డిలీట్ ఫర్ ఎవరీవన్ ఆప్షన్ పనిచేయదు.
అయితే.. ఆ ఆప్షన్‌పై టైమ్ లిమిట్‌ను పెంచే యోచనలో వాట్సప్ ఉన్నట్టు తెలుస్తోంది. దాన్ని రెండు రోజుల వరకు పెంచాలని వాట్సప్ భావిస్తోంది. అంటే.. వాట్సప్‌లో ఇతరులకు పంపించిన మెసేజ్‌ను రెండు రోజుల లోపు కూడా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట.
నిజానికి ఒక వారం పాటు టైమ్ లిమిట్ పెంచాలని వాట్సప్ ఇదివరకే భావించింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. టెస్టింగ్ ఫేజ్‌లోనే ఆ ఫీచర్‌ను ఆపేసింది. తాజాగా రెండు రోజుల 12 గంటల వరకు టైమ్ లిమిట్‌ను పెంచడం కోసం వాట్సప్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
డిలీట్ ఫర్ ఎవరీవన్ అనే ఫీచర్లో కీలక మార్పులపై వాట్సప్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు.