న్యూఢిల్లీ : కాంపోనెంట్ ధరలు పెరగడం, చిప్‌ల కొరత వెంటాడటం వంటి సమస్యలున్నా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు బడ్జెట్ స్మార్ట్పోన్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. శాంసంగ్, షియామి, మొటొరొలా వంటి ప్రీమియం బ్రాండ్లు సైతం బడ్జెట్ ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి.
రూ 15,000లోపు ఫోన్లు సైతం హై రిఫ్రెష్ రేట్ స్ర్కీన్, హోల్ పంచ్ డిజైన్, హై రిజల్యూషన్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీలు వంటి ప్రీమియం ఫీచర్లతో లభిస్తున్నాయి. తక్కువ బడ్జెట్లోనూ హై స్పెసిఫికేషన్స్ లభిస్తుండటంతో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను కొనుగోలుచేసేందుకు కస్టమర్లు ఆసక్తిచూపుతున్నారు. అందుబాటు ధరలోనూ 5జీ ఫోన్లు సైతం మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. రూ 15,000 లోపు ప్రముఖ బ్రాండ్ల బేసిక్ వెర్షన్స్ స్మార్ట్ఫోన్లను పరిశీలిస్తే..
ఐక్యూఓఓ జడ్6 లైట్ 5జీ : రూ 13,999
శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ : రూ 13,999
రెడ్మి నోట్ 11 : రూ 13,499
మోటో జీ42 : రూ 13,999
పోకో ఎం4 5జీ : రూ 13,199