TECNO POVA Slim 5G | టెక్నో సంస్థ పోవా స్లిమ్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. టెక్నో స్లిమ్ సిరీస్‌లో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.78 ఇంచుల 3డి కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1.5కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు.
ఈ ఫోన్ కేవలం 5.95 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉండడంతోపాటు అత్యంత స్లిమ్ డిజైన్ కలిగిన 5జి ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ అత్యుత్తమ సిగ్నల్‌ను అందిస్తుందని, ఉత్తమ డిజైన్‌ను కలిగి ఉందని, అద్భుతమైన ఏఐ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలియజేసింది. అధునాతన టెక్నాలజీతో ఈ ఫోన్‌ను రూపొందించామని, సుపీరియర్ కనెక్టివిటీతోపాటు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుందని చెప్పింది. 5జి ప్లస్ కనెక్టివిటీని ఈ ఫోన్లో అందిస్తున్నారు. అలాగే డ్యుయల్ సిమ్ డ్యుయల్ యాక్టివ్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ 156 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్లు లేదా ఇతర రిమైండర్లకు గాను డైనమిక్‌గా ఫోన్ స్పందించేలా యూజర్లు ఈ ఫోన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్లో ఎల్లా ఏఐ అనే టెక్నో స్మార్ట్ అసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఏఐ భారతీయ భాషలకు కూడా సపోర్ట్‌ను అందిస్తుంది. అలాగే ఈ ఫోన్లో ఏఐ కాల్ అసిస్టెంట్, ఏఐ రైటింగ్, ఏఐ ఇమేజ్ ఎడిటింగ్, సర్కిల్ టు సెర్చ్, ప్రైవసీ బ్లర్రింగ్ వంటి ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్ స్లీక్ డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ బ్యాటరీ ఎక్కువగానే కలిగి ఉంటుంది. 5160 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో అందిస్తున్నారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. అలాగే ఫోన్‌తోపాటు బాక్స్‌లో చార్జర్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అలాగే సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను ఇందులో అందిస్తున్నారు.
ఈ ఫోన్లో 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. కేవలం సింగిల్ వేరియెంట్‌లోనే లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది, ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ ఉంది కనుక సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. నాణ్యమైన ఆడియోను ఆస్వాదించవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఇన్ ఫ్రారెడ్ సెన్సార్‌ను కూడా ఇచ్చారు. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ఐపీ 64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. టెక్నో పోవా స్లిమ్ 5జి ఫోన్‌ను స్కై బ్లూ, స్లిమ్ వైట్, కూల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.