TCL Tab10 | 5జీ మద్దతుతో 8000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో అమెరికా మార్కెట్లోకి ట్యాబ్ 10 వస్తున్నది. ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియా టెక్ చిప్సెట్ వంటి ఫీచర్లు ఉంటాయి. డ్యూయల్ స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది. గ్రే కలర్ ఆప్షన్లో వస్తున్న టీసీఎల్ ట్యాబ్ 10 ధర రూ.23,868 (299 డాలర్లు) ఉంటుంది. టీ-మొబైల్, మెట్రో బై టీ-మొబైల్ స్టోర్ల వద్ద శుక్రవారం (2022 ఆగస్టు 26) నుంచి సేల్స్ మొదలవుతాయి.
టీసీఎల్ ట్యాబ్ 1920×1200 పిక్సెల్ రిజొల్యూసన్తో 10.1 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 60హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. ఆక్టాకోర్ మీడియా టెక్ కొంపానియో 800 టీ చిప్సెట్తో టీసీఎల్ ట్యాబ్ 10 మార్కెట్లోకి వస్తున్నది.
మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ట్యాబెట్ 4జీబీ రామ్ సామర్థ్యంతో 32 జీబీల స్టోరేజీ కెపాసిటీతో డిజైన్ చేశారు. మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజీ సామర్థ్యాన్ని 512 జీబీ వరకు విస్తరించొచ్చు. టీసీఎల్ ట్యాబ్.. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తుంది. ఇందులో 8 ఎంపీ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా జత చేశారు. డోల్బో ఆట్మోస్ ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్లతో వస్తున్నది.