న్యూఢిల్లీ : ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో లేటెస్ట్ ఫీచర్‌పై కసరత్తు సాగిస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇమేజ్‌లను వాటి ఒరిజినల్ క్వాలిటీతో పంపే వెసులుబాటు యూజర్లకు కలుగుతుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో షేర్ చేసే ఇమేజ్‌లన్నీ వాట్సాప్ కాంటాక్ట్స్‌లోకి సమర్ధంగా షేర్ అయ్యేలా కంప్రెషన్‌కు గురవుతున్నాయి.
ఇకపై హెచ్డీ ఫొటోలను ఒరిజినల్ క్వాలిటీతోనే తమ కాంటాక్ట్‌ల్లో షేర్ చేసేందుకు లేటెస్ట్ ఫీచర్‌పై వాట్సాప్ కసరత్తు సాగిస్తోంది. ఈ దిశగా వాట్సాప్ బీటా టెస్టింగ్ వెర్షన్‌ను ప్రారంభించిందని వాబీటఇన్ఫో తెలిపింది. న్యూ ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లందరికీ ఫ్యూచర్ అప్డేట్గా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ విడుదల చేయనుంది.
న్యూ ఆప్షన్లో ఇమేజ్ను కాంటాక్ట్స్‌లోకి షేర్ చేసే ముందు ఫొటో క్వాలిటీని మార్చుకునేందుకు ఇమేజ్ ప్రివ్యూ సెక్షన్‌ను కూడా జోడించనున్నట్టు వాబీటాఇన్ఫో పేర్కొంది. న్యూ ఫీచర్‌తో యూజర్లు తాము పంపే ఫొటోపై పూర్తి నియంత్రణను కలిగిఉంటారు. ఇక యూజర్లు స్టేటస్ అప్డేట్స్లో వాయిస్ నోట్స్‌ను షేర్ చేసే వెసులుబాటు కల్పించేందుకు వాట్సాప్ న్యూ వాయిస్ స్టేటస్ అప్డేట్పైనా కసరత్తు సాగిస్తోంది.