న్యూఢిల్లీ : యువత స్మార్ట్‌వాచ్‌ల కొనుగోలుకు మొగ్గుచూపుతుండటంతో భారత్‌లో స్మార్ట్‌వాచ్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లు లభిస్తుండటంతో వీటి సేల్స్ ఊపందుకున్నాయి. 2022లో భారత్‌లో స్మార్ట్‌వాచ్ యూజర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని రీసెర్చ్ సంస్ధ కౌంటర్‌పాయింట్ పేర్కొంది.
కొన్నేండ్ల కిందట పలు స్మార్ట్‌వాచ్‌ల ధరలు రూ. 10,000పైనే ఉండగా ఇప్పుడవి భారీగా దిగిరావడం కూడా స్మార్ట్‌వాచ్‌ల సేల్స్ విపరీతంగా పెరిగేందుకు కారణమని టెక్ నిపుణులు చెబుతున్నారు. నాయిస్, ఫైర్ బోల్ట్ వంటి కంపెనీలు తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేయడంతో షియామి, వన్‌ప్లస్ వంటి దిగ్గజ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని రూ . 5000 లోపు స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేస్తున్నాయి.
రూ. 5000లోపు ధరలో లభించే స్మార్ట్‌వాచ్‌లు సైతం యాపిల్ వాచ్, గెలాక్సీ వాచ్ సిరీస్‌లకు దీటైన వాచ్‌లను అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. హెల్త్, స్పోర్ట్స్ ఫీచర్లతో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను కూడా బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక రూ. 5000లోపు మెరుగైన స్మార్ట్‌వాచ్‌లను పరిశీలిస్తే..
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ రూ. 4999
రియల్మీ వాచ్ 3 రూ. 3499
అమేజ్‌ఫిట్ బిప్ 3 రూ. 3499
రెడ్మి వాచ్ 2 లైట్ రూ. 3499
ఫైర్‌బోల్ట్ రింగ్ 3 రూ . 2999