ఒకప్పుడు ఫోన్లు అంటే కేవలం ఫోన్లో మాట్లాడుకోవడానికి మాత్రమే వాడేవాళ్లుం. కానీ ఇప్పుడు వచ్చే ఫోన్లతో అరచేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు. అందుకే వాటిని స్మార్ట్ ఫోన్లు అని అంటున్నాం. స్మార్ట్ ఫోన్లను కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా.. చాలా రకాలుగా వాడుతున్నాం. ఫోన్ నుంచే ఆన్ లైన్ షాపింగ్, ఆన్ లైన్ ఆర్డర్లు, వాలెట్లు, నెట్ బ్యాంకింగ్, ఆన్ లైన్ మనీ ట్రాన్స్ఫర్.. ఇలా రకరకాల పనుల కోసం స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఫోన్‌ను మరో వ్యక్తి యాక్సెస్ చేసేలా ఉండకూడదు. సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ వాడాలి. ఫోన్లో ఉండే సెక్యూరిటీ ఫీచర్లను అన్నింటినీ వాడితేనే ఫోన్‌కు ఎటువంటి సమస్య ఉండదు. అలాగే.. ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఫోన్లో ఖచ్చితంగా సెక్యూరిటీ ఫీచర్స్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాలి.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే యూజర్లు మాత్రం ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను చేసుకోవాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్‌కు స్క్రీన్ లాక్ పెట్టకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ముందు ఫోన్‌ను ఎవ్వరూ ఓపెన్ చేసే అవకాశం ఉండదు. పిన్ నెంబర్ కానీ.. ప్యాటర్న్ పెట్టుకొని కానీ.. పాస్ వర్డ్ పెట్టుకొని ఫోన్లో స్క్రీన్ లాక్ పెట్టుకోవచ్చు. ఒకవేళ స్క్రీన్ లాక్ పెట్టుకున్నా.. ఫింగర్ ప్రింట్‌తో ఫోన్‌ను అన్ లాక్ చేయొచ్చు.
లాక్ స్క్రీన్ పెట్టుకున్నాక.. ఎటువంటి నోటిఫికేషన్స్ రావాలో కూడా ముందే సెట్టింగ్స్‌లో మార్చుకోవచ్చు. కొన్ని యాప్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రమే కావాలా.. లేక ఫోన్‌కు వచ్చే ప్రతి నోటిఫికేషన్‌ను కావాలనుకుంటే సెట్టింగ్స్‌లో మార్చుకోవాలి. అయితే.. ఇందులో కొన్ని సెట్టింగ్స్ కావాలంటే మాత్రం ఆండ్రాయిడ్ 11 లేదా అంతకంటే ఎక్కువ వర్షన్ ఉన్న ఓఎస్‌లోనే ఈ ఆప్షన్స్ ఉంటాయి.
ఫైండ్ మై డివైజ్ ఆప్షన్‌ను మాత్రం ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే.. ఒకవేళ ఫోన్ పోయినా కూడా ఈ సెట్టింగ్స్ ద్వారా ఫోన్ ఎక్కడుందో కనిపెట్టే చాన్స్ ఉంటుంది. ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌నే ఇదివరకు ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ అని పిలిచేవాళ్లు. దీన్ని సెట్ చేసుకోవడం కోసం.. సెట్టింగ్స్‌లోకి వెల్లి.. సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఫైండ్ మై డివైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ లొకేషన్‌ను ఆన్ చేయాలి. ఇది ఆన్‌లో ఉంటేనే మీ ఫోన్ పోయినా కూడా దాని లొకేషన్‌ను ట్రేస్ చేయొచ్చు.
చాలామంది తమ ఫోన్‌ను లాక్ చేయకుండా అలాగే ఉంచుతారు. అలా ఉంచడం వల్ల ఫోన్ లాక్ కాకుండా అన్‌లాక్‌లోనే ఉంటుంది. అటువంటి సమయాల్లో స్మార్ట్ లాక్ అనే ఆప్షన్‌ను సెట్ చేసుకుంటే.. ఫోన్ కంటిన్యూగా కొంతసేపు అన్ లాక్‌లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా లాక్ అయిపోతుంది. స్మార్ట్ లాక్ ఆప్షన్‌ను సెట్ చేసుకుంటే.. దాన్ని అన్‌లాక్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా పిన్ నెంబర్ కానీ.. లేదా ప్యాటర్న్, పాస్ వర్డ్ ఏదో ఒకటి ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే.. ఈ ఆప్షన్ కేవలం ఆండ్రాయిడ్ 10, అంతకంటే ఎక్కువ వర్షన్‌లోనే లభిస్తుంది.
గూగుల్ ప్లే ప్రొటెక్ట్.. ఫోన్‌ను సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఉంచుతుంది. ఫోన్లో ఉన్న యాప్స్ జెన్యూనా కాదా.. అని చెక్ చేస్తుంది. అలాగే.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ యాప్ డౌన్ లోడ్ కావడానికి ముందే దాన్ని చెక్ చేసి.. ఏదైనా హాని తలపెట్టే యాప్ అయితే దాన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేయకుండా నిరోధిస్తుంది. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను మీ ఫోన్లో ఆన్ చేసుకోవడం కోసం.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్ ను ఆన్ చేయాల్సి ఉంటుంది. యూజర్స్ ఎప్పటికప్పుడు ఫోన్‌ను స్కాన్ చేస్తూ ఉంటే ఏవైనా ఫోన్‌కు హాని కలిగించే యాప్స్ ఉంటే వెంటనే గూగుల్ ప్లే ప్రొటెక్ట్ దాన్ని ఫోన్ నుంచి తొలగిస్తుంది.
ఎప్పుడూ సేఫ్ బ్రౌజింగ్ చేయాలి. ఏది పడితే ఆ వెబ్ బ్రౌజర్లో డేటాను సెర్చ్ చేయకూడదు. సేఫ్ బ్రౌజింగ్ కోసం క్రోమ్‌ను ఉపయోగించవచ్చు. గూగుల్ క్రోమ్‌ను మీ డీఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేసుకొని.. దాంట్లోనే నెట్‌ను బ్రౌజ్ చేయండి.
గూగుల్ అకౌంట్‌ను సెక్యూర్డ్‌గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే.. ఎప్పటికప్పుడు సెక్యూరిటీ చెకప్ చేస్తూ ఉండాలి. గూగుల్ అకౌంట్‌ను భద్రంగా ఉంచుకోవడం కోసం కొన్ని రికమండేషన్స్‌ను సెక్యూరిటీ చెకప్ ద్వారా పొందొచ్చు.
ఏదైనా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ యాప్‌కు ఇచ్చే పర్మిషన్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. లేదంటే ఫోన్లోని సెన్సిటివ్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే.. థర్డ్ పార్టీ యాప్స్‌కు ఇచ్చే పర్మిషన్లను ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ ఉండాలి.
గూగుల్ అకౌంట్ పాస్వర్డ్స్ ఒక్కోసారి బహిర్గతం అవుతుంటాయి. వాటిని ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. చాలా అకౌంట్లలో ఉపయోగించినప్పుడు అలా అయ్యే చాన్సెస్ ఉంటాయి. అటువంటప్పుడు.. passwords.google.com వెబ్ సైట్లోకి వెళ్లి చెక్ పాస్వర్డ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ పాస్ వర్డ్‌ను చేంజ్ చేసుకుంటే.. గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిన అన్ని సైట్లలో పాస్ వర్డ్ అప్ డేట్ అవుతుంది.