EV Battery | 5 నిమిషాల్లోనే చార్జ్ అయ్యే ఈవీ బ్యాటరీ.. కార్నెల్ పరిశోధకుల బృందం అభివృద్ధి
పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలను) అందుబాటులోకి తెస్తున్నాయి.
న్యూయార్క్: పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలను) అందుబాటులోకి తెస్తున్నాయి. కానీ, బ్యాటరీల చార్జింగ్కు చాలా సమయం పడుతుండటం ఈవీల వినియోగానికి ప్రధాన అవరోధంగా పరిణమిస్తున్నది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికాలోని కార్నెల్ ఇంజినీరింగ్ విద్యాసంస్థ ప్రొఫెసర్ లిండెన్ ఆర్చర్ నేతృత్వంలోని పరిశోధక బృందం సరికొత్త లిథియం బ్యాటరీని అభివృద్ధి చేసింది. కేవలం 5 నిమిషాల్లోపే చార్జ్ కావడం దీని ప్రత్యేకత. ఈ బ్యాటరీ అందుబాటులోకి వస్తే ఈవీల చార్జింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అగత్యం తప్పడంతోపాటు విద్యుత్తు వాహనాల వినియోగం ఊపందుకుంటుంది.
వాస్తవానికి విద్యుత్తు వాహన రంగంలో సాంకేతికత ఇప్పటికే కొంత మేరకు అభివృద్ధి చెందింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేగవంతమైన వాణిజ్య చార్జర్ సాయంతో ఒక ఈవీని చార్జ్ చేసేందుకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతున్నది. ఇది ఇండ్లలో వాడే సాధారణ చార్జర్ కంటే చాలా మెరుగైనదే అయినప్పటికీ ఈవీల వినియోగాన్ని పెంచేందుకు మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉన్నది.
ఒక ఈవీ బ్యాటరీని మనం కేవలం 5 నిమిషాల్లో చార్జ్ చేసుకోగలిగితే 300 మైళ్ల దూరం ప్రయాణించేందుకు అవసరమైన భారీ బ్యాటరీని కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరకు లభ్యమయ్యే బ్యాటరీతోనే సరిపెట్టుకోవచ్చని, దీంతో విద్యుత్తు వాహనాల ధరలు తగ్గి వినియోగం కూడా పెరుగుతుందని ఆర్చర్ వివరించారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

