Samsung Galaxy Tab A11 Plus | స్మార్ట్ ఫోన్లతోపాటు ట్యాబ్‌లు కొత్తగా లాంచ్ అయినప్పుడు వినియోగదారులు ట్యాబ్‌ల పట్ల అంతగా ఆసక్తిని చూపించలేదు. కానీ తరువాతి కాలంలో ట్యాబ్‌లకు కూడా విశేష రీతిలో ఆదరణ పెరిగింది. ట్యాబ్‌లను చిన్నపాటి కంప్యూటర్ల మాదిరిగా ఉపయోగించుకునే వీలు ఉండడంతో ట్యాబ్‌లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. కరోనా సమయం నుంచి ట్యాబ్‌ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని గణాంకాలు సైతం చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కంపెనీలు సైతం ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లతో పలు నూతన ట్యాబ్‌లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. గతంలో ట్యాబ్‌ల ధర కూడా ఎక్కువగానే ఉండేది. కానీ ప్రస్తుతం పోటీ పెరగడంతో కంపెనీలు ట్యాబ్‌లను కూడా తక్కువ ధరలకే అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే శాంసంగ్ కూడా ఇదే కోవలో ఓ నూతన ట్యాబ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎ11ప్లస్ పేరిట ఓ నూతన ట్యాబ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండడంతోపాటు ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
గెలాక్సీ ట్యాబ్ ఎ11 ప్లస్ ట్యాబ్ శాంసంగ్‌కు చెందిన ఎ సిరీస్ లేటెస్ట్ ట్యాబ్ కావడం విశేషం. గత సెప్టెంబర్ నెలలో ట్యాబ్ ఎ11ను లాంచ్ చేయగా, ఇప్పుడు ఈ ట్యాబ్‌ను విడుదల చేశారు. గెలాక్సీ ట్యాబ్ ఎ11 ప్లస్ ట్యాబ్‌లో 11 ఇంచుల టీఎఫ్టీ డిస్ప్లే ఉంది. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. కనుక డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ ఎంటీ8775 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్యాబ్ వైఫై, 5జి ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 5జి ఆప్షన్ ఉన్న ట్యాబ్‌లో వినియోగదారులు 5జి సిమ్ వేసుకుని 5జి సేవలను పొందవచ్చు. ఇక ఈ ట్యాబ్‌కు వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ట్యాబ్‌లో డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. కనుక సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ట్యాబ్‌లో ఏకంగా 7040 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. కనుక ట్యాబ్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అలాగే 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు దీనికి సపోర్ట్‌ను అందిస్తున్నారు. కనుక ట్యాబ్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్‌కు గాను 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను కూడా ఇచ్చారు. కనుక వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ను కూడా దీనికి కనెక్ట్ చేయవచ్చు. ఈ ట్యాబ్‌ను 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. డ్యుయల్ స్పీకర్లను ఇందులో ఇచ్చారు. కనుక ఆడియో పెద్దగా వస్తుంది. ఈ ట్యాబ్‌కు 5జి సదుపాయం ఉంది. 5జి సేవలకు గాను సిమ్ ను వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 5జి వద్దనుకుంటే వైఫై మోడల్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ ట్యాబ్ లో డ్యుయల్ బ్యాండ్ వైఫై లభిస్తుంది. అలాగే బ్లూటూత్ 5.3 ఎల్ఈ, జీపీఎస్, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ11 ప్లస్‌కు చెందిన వైఫై మోడల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.22,999 ఉండగా, ఇదే మోడల్ 5జి వేరియెంట్ ధర రూ.26,999గా ఉంది. అలాగే ఈ ట్యాబ్‌కు చెందిన వైఫై మోడల్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.28,999గా నిర్ణయించారు. ఇదే మోడల్‌కు చెందిన 5జి వేరియెంట్ ధర రూ.32,999గా ఉంది. ఈ ట్యాబ్ లు అన్ని మోడల్స్‌పై లాంచింగ్ సందర్భంగా రూ.3వేల తగ్గింపు ధరను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌ను గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. అమెజాన్‌తోపాటు శాంసంగ్ ఇండియా ఆన్ లైన్ స్టోర్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్స్‌లో ఈ ట్యాబ్‌ను ప్రస్తుతం విక్రయిస్తున్నారు.