Samsung Galaxy S25 FE | శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎస్25 సిరీస్‌లో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిషన్) పేరిట ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎస్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.7 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను సైతం పొందవచ్చు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ డిస్ప్లేకు గాను గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా దృఢంగా కూడా ఉంటుంది.
ఈ ఫోన్లో శాంసంగ్‌కు చెందిన ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్‌ను అమర్చారు. గతంలో వచ్చిన ఎఫ్ఈ ఎడిషన్ ఫోన్ కన్నా 10 శాతం ఎక్కువ హీట్‌ను ఈ ఫోన్ తట్టుకుంటుంది. అందుకు గాను ప్రత్యేకమైన వేపర్ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీనికి గాను 7 ఆండ్రాయిడ్ అప్డేట్స్ను, 7 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని శాంసంగ్ తెలియజేసింది. ఎస్25 సిరీస్‌లో వచ్చిన గత ఫోన్లకు కూడా ఇదే రీతిలో ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తుండడం విశేషం. ఇక ఇందులో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఏర్పాటు చేశారు. మరో 8 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. ముందు వైపు 12 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు.
ఈ ఫోన్‌కు వెనుక వైపు గ్లాస్ బ్యాక్‌ను ఇచ్చారు. దీనికి అధునాతన ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌ను అమర్చారు. కనుక ఫోన్ చాలా క్వాలిటీగా, దృఢంగా ఉంటుంది. ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో లభిస్తుంది. దీనికి గాను 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను సైతం అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు. అందువల్ల సౌండ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. నాణ్యమైన సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ లభిస్తుంది. బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు సదుపాయాలను సైతం అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్‌ను నేవీ, జెట్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.59,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.65,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.77,999గా ఉంది. ఈ ఫోన్‌ను శాంసంగ్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఆథరైజ్డ్ రిటెయిల్ స్టోర్స్, ఇతర ఆన్లైన్ స్టోర్స్‌లో సెప్టెంబర్ 29 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భగా ఈ ఫోన్ పై పలు ఆఫర్లను సైతం అందిస్తున్నారు. పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.5వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది.