న్యూఢిల్లీ : షియామి అధికారిక వెబ్సైట్లో కనిపించిన రెడ్మి 11 ప్రైమ్ 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంఛ్ కానుంది. రెడ్మి 10 ప్రైమ్‌కు కొనసాగింపుగా రానున్న రెడ్మి 11 ప్రైమ్ 5జీ అతి త్వరలో భారత్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. గత ఏడాది లాంఛ్ అయిన రెడ్మి 10 ప్రైమ్ తరహాలోనే అందుబాటు ధరలో రెడ్మి 11 ప్రైమ్ 5జీ కస్టమర్లను ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిజైన్ అప్‌గ్రేడ్‌తో పాటు మెరుగైన హార్డ్‌వేర్‌తో రెడ్మి 11 ప్రైమ్ 5జీ కస్టమర్ల ముందుకు రానుంది. రీజనబుల్ ధరలో 5జీ సపోర్ట్‌తో రానున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై ఆసక్తి నెలకొంది. రెడ్మి 11 ప్రైమ్ 5జీ ఫీచర్లపై ఇప్పటివరకూ కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినా ముందుగా గ్లోబల్ మార్కెట్లలో లాంఛ్ అయి ఆపై భారత్ మార్కెట్లోకి ఈ హాట్ డివైజ్ అందుబాటు లోకి వస్తుందని భావిస్తున్నారు.
రెడ్మి 10 ప్రైమ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రెడ్మి 11 ప్రొ రానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెడ్మి 11 ప్రైమ్ స్పెసిఫికేషన్స్ కూడా ఇంతవరకూ లీక్ కాకపోవడంతో ఫీచర్లపైనా ఇంకా స్పష్టత రాలేదు. అయితే రెడ్మి 10 ప్రైమ్ కంటే రెడ్మి 11 ప్రైమ్ 5జీ ధర కొద్దిగా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.