Realme Narzo N55 | రియల్మీ నార్జే ఎన్55 (Realme Narzo N55) ఫోన్ భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఎన్55 పేరుతో మార్కెట్లోకి తెస్తున్న రియల్మీ నార్డే 55 ఫోన్‌తోపాటు రియల్మీ తొలిఫోన్ ఇది. ఇందులో ఆపిల్ ఐ-ఫోన్ 14 ప్రోలో వాడిన డైనమిక్ ఐలాండ్, మినీ క్యాప్సూల్ తదితర ఫీచర్లు ఉన్నాయి. నార్జే సిరీస్‌లో వస్తున్న ఈ నెల13న స్పెషల్ లాంచ్ ఆఫర్ అందుబాటులో ఉంది. అదనపు డిస్కౌంట్లతో కూడిన సేల్స్ ఈ నెల 18-21 తేదీల మధ్య రియల్మీ వెబ్సైట్, అమెజాన్ వెబ్సైట్లలో జరుగుతుంది.
బుధవారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన రియల్ మీ నార్జే ఎన్55 (Realme Narzo N55) ఫోన్ 90 హెర్ట్ రీఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, 2400×1080 పిక్సెల్స్‌తో ఫుల్ హెచ్డీ+తో వస్తున్నది. ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ88 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల నాన్-రిమూవబుల్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. రియల్ మీ నార్జో ఎన్55 ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ కోసం 35 వాట్ల ఫాస్ట్ చార్జర్‌కు సపోర్ట్‌గా ఉంటుంది. 20 నిమిషాల్లో సగం చార్జింగ్ అవుతుంది.100 శాతం చార్జింగ్ కావడానికి 63 నిమిషాలు పడుతుంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది రియల్మీ నార్జో ఎన్55 (Realme Narzo N55) . 64-ప్రైమరీ కెమెరా, 2- మెగా పిక్సెల్ కెమెరాతోపాటు సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 8-మెగా పిక్సెల్ సెన్సర్ గల కెమెరా వస్తున్నది. రియల్ మీ నార్జో ఎన్55 ఫోన్.. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్మీ యూఐ 4.0 వర్షన్‌పై పని చేస్తున్నది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగాబైట్ వరకు ఇంటర్నల్ స్టోరేజీ పెంచుకోవచ్చు.
రియల్ మీ నార్జో ఎన్55 (Realme Narzo N55) ఫోన్ ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ5.10, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. యాక్సెలెరో మీటర్, అంబియంట్ లైట్ సెన్సర్, కంపాస్/ మ్యాగ్నెట్ మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం రూ.10,999లకు రియల్మీ నార్జే ఎన్55 సేల్స్ మొదలయ్యాయి.
ఫ్లాష్ సేల్‌లో 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.700, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ కొంటే రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ నెల 18 నుంచి మొదలయ్యే సేల్స్‌లో హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో బుక్ చేసుకుంటే బేస్ వేరియంట్‌పై రూ.500, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ వేరియంట్‌పై రూ.1000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.