realme NARZO 80x 5G | వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కావాలంటే ఒకప్పటిలా ఇప్పుడు భారీ ఎత్తున ధరను వెచ్చించి ఫోన్‌ను కొనుగోలు చేయాల్సిన పనిలేదు. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలోనూ ఈ సదుపాయాన్ని ప్రస్తుతం అనేక కంపెనీలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే రియల్‌మి కూడా లేటెస్ట్గా ఇదే ఫీచర్ కలిగిన ఓ మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ సైతం ఈ ఫోన్లో ఉంది. నార్జో 80ఎక్స్ 5జి పేరిట రియల్‌మి లాంచ్ చేసిన ఈ ఫోన్లో 6.72 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. దీని వల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫోన్ తెరపై నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
నార్జో 80ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. వర్చువల్‌గా మరో 10 జీబీ వరకు ర్యామ్ ను పెంచుకోవచ్చు. అందువల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన మెయిన్ కెమెరా ఉంది. మరో 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ అత్యంత సన్ననైన స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ఐపీ68 ప్లస్ ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అత్యంత చవక ధరకే ఈ ఫీచర్ అందుబాటులో ఉన్న ఫోన్ ఇదే కావడం విశేషం. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 45 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ వేగంగా చార్జింగ్ కూడా అవుతుంది.
ఈ ఫోన్ 6జీజీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియెంట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో ఉన్న మెమొరీని కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్గా ఇది పనిచేస్తుంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. యూఎస్బీ టైప్ సి ఫీచర్ ఇందులో లభిస్తోంది. యూఎస్బీ టైప్ సి ఆడియోను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ను మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో రూపొందించారు. అందువల్ల ఈ ఫోన్ అంత సులభంగా పగలదు. అలాగే తెరపై గీతలు కూడా పడవు. ఈ ఫోన్లో 5జి వాడుకోవచ్చు. అలాగే డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2 వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.
రియల్‌మి నార్జో 80ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌ను డీప్ ఓషియన్, సన్‌లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ పై పలు లాంచింగ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. ఈ ఫోన్‌పై లాంచింగ్ కింద రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. కనుక ఈ ఫోన్ మోడల్స్ ను రూ.11,999, రూ.12,999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటుందని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి వరకు ప్రత్యేక సేల్ ద్వారా విక్రయించనున్నారు. తరువాత సాధారణ ధరతో విక్రయించనున్నట్లు తెలిపారు. కనుక ఆఫర్‌ను పొందాలనుకునేవారు స్పెషల్ సేల్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, రియల్‌మి ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లపై ఈ ఫోన్ అందుబాటులో ఉంది.