న్యూఢిల్లీ : దేశీ మార్కెట్లో రెండు మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ఫోన్లను రియల్మీ లాంఛ్ చేసింది. రూ. 20,000లోపు ధరలో లభించే రియల్మీ 11 5జీ, రియల్మీ 11ఎక్స్ 5జీ (Realme 11X 5G) స్మార్ట్ఫోన్లను కంపెనీ ప్రవేశపెట్టింది. రియల్మీ 11 5జీ యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లో ఎంటరైంది. తక్కువ ధరలో మెరుగైన కెమెరా ఫీచర్లను కోరుకునే కాలేజీ విద్యార్ధులను ఈ డివైజ్ ఆకట్టుకోనుంది.
ఇక ప్రోడక్టివిటీతో రాజీ పడకుండా 5జీ ఇంటర్నెట్ను కోరుకునే కస్టమర్ల కోసం రియల్మీ 11ఎక్స్ 5జీని కంపెనీ లాంఛ్ చేసింది. రియల్మీ 11 5జీ 8జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ భారత్‌లో రూ. 18,999 నుంచి అందుబాటులో ఉంటుంది. రియల్మీ 11 ఎక్స్ 6జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999 నుంచి లభిస్తుంది.
ఈ ఫోన్ రెడ్మి 12 5జీకి దీటైన పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. నెలాఖరులో సేల్ ఆరంభమైనప్పటి నుంచి రియల్మీ 11ఎక్స్ 5జీపై కంపెనీ రూ 1000 డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. ఆగస్ట్ 25న స్పెషల్ యానివర్సరీ సందర్భంగా లిమిటెడ్ స్టాక్స్‌ను అందుబాటులో ఉంచారు. రియల్మీ 11 ఎక్స్ 5జీ బ్లాక్, పర్పుల్ కలర్స్‌లో కస్టమర్ల ముందుకు రానుంది. రియల్మీ 11 6.72 ఇంచ్ ఫుల్హెచ్డీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, మీడియాటెక్ డెమెన్సిటీ 6100+5జీ చిప్ వంటవి ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది. వెనుకభాగంలో 108ఎంపీ ప్రైమరీ కెమెరా ప్రధానంగా ఆకట్టుకోనుంది.
Read More :
iPhone 15 | ఐ-ఫోన్ 15 మ్యాక్స్ రిలీజ్ మరింత ఆలస్యం.. కారణం అదేనా?!