న్యూఢిల్లీ : భారత్‌లో రియల్‌మి సీ33 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. రూ 10,000లోపు బడ్జెట్ ఫోన్లు కోరుకునే వారికోసం ఈ డివైజ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ 8999 నుంచి రియల్‌మి సీ33 ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంది. తక్కువ ధరలో బిగ్ స్క్రీన్, భారీ బ్యాటరీతో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
6.5 ఇంచ్ డిస్ప్లే, యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌ను కలిగిఉంది. 3జీబీ, 4జీబీ ర్యామ్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అవుటాఫ్ ది బాక్స్‌పై రియల్‌మి సీ33 రన్ అవుతుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, ముందు 5 ఎంపీ సెన్సర్‌తో కస్టమర్ల ముందుకొచ్చింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. లేటెస్ట్ రియల్‌మి సీ33 స్మార్ట్‌ఫోన్ న్యూ బౌండ్లెస్ సీ డిజైన్ ఫీచర్‌తో ఆకట్టుకుంటుంది.