ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ప్రత్యేక సేల్‌తో వినియోగదారుల ముందుకొచ్చింది.
తన మూడో వార్షికోత్సవం సందర్భంగా రియల్మీ 3rd యానివర్సరీ సేల్ ప్రారంభించింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రియల్మీడాట్కామ్లో సేల్ మొదలైంది. నాలుగు రోజుల పాటు జరిగే సేల్ జూన్ 8తో ముగుస్తుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, AiOT ప్రొడక్టులు, మొబైల్ యాక్సెసరీలపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది.
సిటీ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డులపై స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై రియల్మీ 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. 20వేలు అంతకన్నా ఎక్కువ విలువైన స్మార్ట్ఫోన్లను ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లిప్‌కార్ట్ 500 తగ్గింపును ఇస్తున్నది. రియల్మీ ఎక్స్7 ప్రొ 5జీ, రియల్మీ ఎక్స్50 ప్రొ, రియల్మీ నార్జో 30 ప్రొ, రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఉంది. రియల్మీ స్మార్ట్‌వాచ్, రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రొ ప్రొడక్టులపై ఆఫర్లు ఉన్నాయి.