Realme 16 Pro | భారతదేశంలో ప్రజాదారణ పొందిన సెల్‌ఫోన్ కంపెనీలలో రియల్‌మి ఒకటి. కొత్తగా ఈ కంపెనీ తమ నంబర్ సిరీస్ లో భాగంగా మరో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. రియల్‌మి 16 ప్రొ, రియల్‌మి 16 ప్రొ ప్లస్ పేరుతో వీటిని విడుదల చేసింది. ఎగువ మధ్య శ్రేణి స్మార్ట్ ఫోన్ లపై పట్టు బిగించాలనే లక్ష్యంతో వీటిని ధర రూ. 31,999 నుండి రూ. 44,999 వరకు ధర ఉండేలా విడుదల చేసింది. బ్రాండ్ ఫోన్ లను తక్కువ ధరకు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇవి ఉపశమనాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. అయితే గతంతో పోలిస్తే ప్రొ, ప్లస్ ధరల్లో స్వల్ప పెరుగుదల ఉందనే చెప్పవచ్చు. రియల్‌మి ఫోన్ డిజైన్, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం, మన్నికపై దృష్టి సారించింది. ఈ రెండు ఫోన్ లు కూడా ప్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా ఆన్లైన్ స్టోర్ లలో అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫోన్ లు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. అలాగే దీనికి మద్దతుగా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో జత చేయబడిన భారీ 7,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ ఫోన్ లో 200 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. దాదాపు 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ కూడా ఉంది. దీంతో వినియోగదారులు క్లియర్ జూమ్ షాట్ లను తీసుకోవచ్చు. పెరిస్కోప్ కెమెరా ఉండడం వల్ల లాంగ్ రేంజ్ ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు తక్కువ ధరలోనే రియల్‌మి 16 ప్రొ ప్లస్ ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్ ముందు భాగంలో రియల్‌మి 16 ప్రొ ప్లస్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 6,500 నిట్ల వరకు పీక్ బ్రైట్నెస్, అల్ట్రా స్లిమ్ 1.48 ఎంఎం బెజెల్స్, 2,500 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ను ఇస్తుంది.
ఈ సంవత్సరం కూడా రియల్‌మి ధృడత్వంపై దృష్టి పెట్టింది. ప్రొ ప్లస్ ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ 69కె రేటింగ్ లను కలిగి ఉంది. అదే విధంగా రియల్‌మి 16 ప్రొ 4కె హెచ్డీఆర్ వీడియో రికార్డింగ్ కు మద్దతుగా 200 మెగాపిక్సల్స్ కెమెరాను కూడా కలిగి ఉంది. ప్రొ ప్లస్ లాగానే రియల్‌మి 19 ప్రొ కూడా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 6,500 నిట్ ల వరకు బ్రైట్నెస్ ను అందించే డిస్ప్లేను కూడా కలిగి ఉంది. రెండు ఫోన్ లలో కూడా ఒకేరకమైన ఐపీ రేటింగ్ లను ఇచ్చారు. లౌడ్‌స్పీకర్ అవుట్‌ఫుట్ లపై ఎక్కువగా ఆధారపడే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్రొ మోడల్ 300 శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్ ను కూడా ఈ ఫోన్ లలో అందించింది. ఈ రెండు ఫోన్ లలో కూడా ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్, ఏరో స్పేస్ గ్రేడ్ ఫ్రేమ్, కుడి అంచున బటన్ లు ఉన్నాయి.
ఇక ప్రొ ప్లస్ మరింత లుక్ కోసం అధిక టచ్ శాంప్లింగ్, అధునాతన డిమ్మింగ్, సన్నని బెజెల్లతో తయారు చేశారు. అలాగే రియల్‌మి 16 ప్రొ, ప్రొ ప్లస్ రెండూ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రియల్‌మి యుఐ7.0 ని అమలు చేస్తాయి. అదే విధంగా మూడు ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్ లను, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీని కూడా కంపెనీ అందించనుంది.
ఇక ధర విషయనికొస్తే రియల్‌మి 16 ప్రొ 5జి 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 31,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 8జీబీ, 256జీబీ వెర్షన్ ధర రూ. 33, 999గా ఉండగా 12జీబీ, 256 జీబీ మోడల్ ధర రూ. 36,999 గా ఉంది. అదే విధంగా రియల్‌మి ప్రొ ప్లస్ 5జి 8జీబీ, 128జీబీ ధర రూ. 39,999 నుండి ప్రారంభమవుతుంది. 8జీబీ, 256 జీబీ ధర రూ. 41,999, 12జీబీ, 256 జీబీ ధర రూ. 44,999 వరకు ఉంటుంది. జనవరి 9 నుండి ఈ సేల్ ప్రారంభమవుతుంది. అలాగే కొన్ని బ్యాంక్ కార్డులు 16 ప్రొ వెర్షన్ పై రూ.3000 డిస్కౌంట్ ను, 16 ప్రొ ప్లస్ పై రూ. 4000 డిస్కౌంట్ ను అందించనున్నాయి.