ఇప్పుడంతా ఏఐ యుగం నడుస్తోంది. అందరూ ఏఐ టెక్నాలజీని వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ మనకు ఏఐతో క్రియేట్ చేసిన ఫొటోలు, వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం తమ ఫోన్లలో ఏఐ ఫీచర్లను అందిస్తున్నాయి. గతంలో కేవలం ఫ్లాగ్ షిప్ ఫోన్లలోనే ఈ ఫీచర్లు ఉండేవి. కానీ ఇప్పుడు మిడ్ రేంజ్, బడ్జెట్ ఫోన్లలోనూ ఈ ఫీచర్లను అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా వరకు ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ అనేది సమస్యగా మారింది. వాడకం పెరగడంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా అవసరం పడుతోంది. అందులో భాగంగానే రియల్ మి ఏఐ ఫీచర్లతోపాటు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉన్న ఓ స్మార్ట్ ఫోన్‌ను లేటెస్ట్గా రిలీజ్ చేసింది. ఇందులో పలు ఇతర ఆకట్టుకునే ఫీచర్లను సైతం అందిస్తున్నారు.
రియల్ మి 14టి 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను లేటెస్ట్గా లాంచ్ చేసింది. ఇందులో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ఐపీ 69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌కు ఉంది. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను సిల్కెన్ గ్రీన్, వయోలెట్ గ్రేస్, సాటిన్ ఇంక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు.
రియల్‌మి 14టి 5జి ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. మరో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా కూడా వెనుక వైపు ఉంది. ఈ ఫోన్ ద్వారా రికార్డు చేసే వీడియోలకు లేదా ఆడియోకు క్వాలిటీని 300 శాతం వరకు పెంచవచ్చు. అందుకు గాను అల్ట్రా వాల్యూమ్ మోడ్ ఫీచర్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌ను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఈ ఫోన్లో సపోర్ట్ లభిస్తుంది.
5జి సేవలను ఈ ఫోన్లో ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఆన్ లైన్లో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లేదా రూ.2000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అలాగే ఈ ఫోన్ కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999 ఉండగా ఈ ఫోన్‌ను ఆన్లైన్ లో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. రియల్ మి 14టి 5జి ఫోన్‌ను రియల్‌మి ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.