Realme 10 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ.. దేశీయ మార్కెట్లోకి రియల్మీ 10 ఫోన్ ఆవిష్కరించింది. 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ గల ఈ ఫోన్ 4జీతో పని చేస్తుంది. ఈ నెల 15 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ ధర రూ.13,999 నుంచి మొదలవుతుంది. ఈ ఫోన్ క్లాష్ వైట్, రష్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
రియల్ మీ 10 ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం అవుతుంది. తొలి వేరియంట్ ఫోన్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ స్టోరేజీతో వస్తుంది. 4జీబీ రామ్ సామర్థ్యం గల ఫోన్ రూ.13,999లకు లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్‌గా రూ.1000 స్పెషల్ డిస్కౌంట్ ఇస్తోంది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో వస్తున్న మరో వేరియంట్ ఫోన్ రూ.16,999లకు అందుబాటులో ఉంటుంది. 8జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ డేటా స్టోర్ చేసుకోవచ్చు.
రియల్మీ 10 ఫోన్ 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. మీడియా టెక్ హెలియో జీ99 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్5 ప్రొటెక్షన్ ఉంటుంది.
డ్యుయల్ రేర్ కెమెరా గల ఈ ఫోన్లో ఫస్ట్ సెన్సర్ 50 మెగా పిక్సెల్స్ సామర్థ్యంతో, రెండోవది 2 ఎంపీ మైక్రో క్రోమ్ సెన్సర్‌తో వస్తున్నది. వీటితోపాటు ఫ్రంట్ కెమెరాలో 16-మెగా పిక్సెల్ సెన్సర్ కూడా అందిస్తున్నది.
33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ గల రియల్ మీ 10 ఫోన్.. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంటుంది. కేవలం 28 నిమిసాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది.