Realme 10 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ.. ఎంపిక చేసిన మార్కెట్లలోకి రియల్ మీ-10 5జీ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ఫ్లస్ డిస్ప్లే , మీడియా టెక్ డైమెన్సిటీ 700 ఎస్వోసీతో వస్తున్నది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా ఫీచర్ ఉంటుంది. దీని డెలివరీ నాయిస్ 87డీబీలుగా ఉంటుంది. రియల్మీ 10 5జీ ఫోన్ 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంటుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 33వాట్ల ఫ్లాష్ చార్జింగ్ ఉంటుంది. కేవలం అర్థగంట లోపే బ్యాటరీ 50 శాతం చార్జి అవుతుందని రియల్మీ చెబుతున్నది.
8జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ 1,299 యువాన్లకు (సుమారుగా రూ 14,700) లకు లభిస్తుంది. 8జీబీ రామ్ విత్ 256జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ సుమారుగా రూ. 18,000 లభిస్తుంది. చైనాలో రిజిన్ డౌజిన్, స్టోన్ క్లిస్టల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే రియల్ మీ-10 5జీ వేరియంట్ ఫోన్ ఎప్పుడు భారత్ మార్కెట్లోకి వస్తుందన్న సంగతి తెలియడం లేదు. ఇటీవలే రియల్మీ-10 4జీ వేరియంట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది.
రియల్ మీ-10 5జీ ఆండ్రాయిడ్ 12- బేస్డ్ రియల్మీ యూఐ 3.0 వర్షన్‌తో సేవలందిస్తున్నది. 6.6-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1,080×2,408 పిక్సెల్స్) అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఒక్టాకోర్ 7ఎంఎం మీడియా టెక్ డైమెన్సిటీ 5జీ ఎస్వోసీ విత్ 8జీబీ ఆఫ్ ఎల్పీడీడీఆర్4X రామ్‌తో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ f/1.8 లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్ విత్ f/2.4 లెన్స్ కెమెరా, పోర్టైర్ పెన్సర్ విత్ f/2.8 లెన్స్ లండ్ 50-డిగ్రీ ఫీల్డ్ వ్యూ కెమెరా వస్తుంది.