PUBG – New State : పబ్జీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇండియాలో గేమ్ లాంచ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ఇండియాలో గేమ్ లాంచ్.. పబ్జీ లవర్స్‌కు గుడ్ న్యూస్ | పబ్జీ లవర్స్ ఎగిరి గంతేయాల్సిన రోజు వచ్చేసింది. పబ్జీ గేమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఆ గేమ్‌కు యూత్ ఎలా అతుక్కుపోతుందో అందరికీ తెలిసిందే. చైనా యాప్ కావడం వల్ల ఆ గేమ్‌ను
పబ్జీ లవర్స్ ఎగిరి గంతేయాల్సిన రోజు వచ్చేసింది. పబ్జీ గేమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఆ గేమ్‌కు యూత్ ఎలా అతుక్కుపోతుందో అందరికీ తెలిసిందే. చైనా యాప్ కావడం వల్ల ఆ గేమ్‌ను ఇండియాలో బ్యాన్ చేశారు. దీంతో పబ్జీ లవర్స్ ఒక్కసారిగా బావురుమన్నారు. ఆతర్వాత దేశీయ యాప్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ)ని లాంచ్ చేశారు. బీజీఎంఐ గేమ్ కూడా అచ్చం పబ్జీ లాగానే ఉన్నప్పటికీ.. అసలైన పబ్జీ గేమ్ ఆటను ఆస్వాదించాలనుకునే వారికి పబ్జీ గేమ్ రూపకర్త క్రాఫ్టన్ గుడ్ న్యూస్ చెప్పింది.

పబ్జీ న్యూ స్టేట్ పేరుతో మరో గేమ్‌ను ఇండియాలో లాంచ్ చేయబోతోంది. నవంబర్ 11న ఈ గేమ్‌ను ఇండియాతో పాటు మరో 200 దేశాల్లో విడుదల చేయబోతున్నారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వర్షన్లలో ఈ గేమ్ విడుదల కానుంది.
అక్టోబర్ 29 నుంచి 30 వరకు 28 దేశాల్లో ఈ గేమ్‌కు టెక్నికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. పబ్జీ న్యూ స్టేట్ గేమ్‌ను లాంచ్ చేయనున్నట్టు గత ఫిబ్రవరి నెలలోనే క్రాఫ్టన్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ గేమ్‌కు 50 మిలియన్ల ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా వచ్చాయని కంపెనీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ నుంచి ఈ గేమ్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్లను క్రాఫ్టన్ ప్రారంభించింది.
ఈ గేమ్‌ను 17 భాషల్లో ఆడొచ్చు. 28 దేశాల్లో ఫైనల్ టెక్నికల్ టెస్ట్ జరగనుంది. అందులో ఇండియా లేదు. ఈ కొత్త గేమ్‌లో నెక్స్ట్ జనరేషన్ బ్యాటిల్ రాయలె ఎక్స్‌పీరియెన్స్‌ను పొందొచ్చు. సరికొత్త రెండరింగ్ టెక్నాలజీ, కొత్త గన్ప్లే సిస్టమ్ ఈ గేమ్‌లో ఉంటాయి. పబ్జీ గేమ్‌లోని ఫీచర్లను తీసుకొనే ఈ గేమ్‌ను రూపొందించామని.. ఈ గేమ్ ప్రపంచ మార్కెట్లో తన సత్తా చాటుతుందని క్రాఫ్టన్ సంస్థ సీఈవో కిమ్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Android 12 for iQoo : ఐక్యూ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్
Android 12 : ఆండ్రాయిడ్ 12లో బగ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు
Amazon Sale : అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఆపిల్ ఆఫర్.. ఇండియాలో ఇంటెర్న్ల కోసం చూస్తున్న టెక్ జెయింట్
Facebook plans to change name | ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

