కోడింగ్ లేని ప్రోగ్రాం

- 10 రోజుల్లో ప్రోగ్రామర్ కావొచ్చు
- అందుబాటులో నో కోడ్ టెక్నాలజీ
- సూపర్ 100 పేరుతో కొత్త కోర్సు
హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): సీ, సీ++, జావా, పీహెచ్‌పీ, సీక్వెల్, పైథాన్.. ప్రోగ్రామర్ కావాలంటే ఇందులో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ నేర్చుకోవటం తప్పనిసరి. కానీ ఆ లాంగ్వేజీలన్నీ నేర్చుకొనే అవసరం లేకుండానే, కోడింగ్ రాయకుండానే.. పది రోజుల్లో ప్రోగ్రామర్ కావొచ్చు. నో-కోడ్ టెక్నాలజీ (జీరో కోడ్)తో ఇది సాధ్యమంటున్నారు నిపుణులు. సూపర్ 100 పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కోర్సు ఇప్పుడు సరికొత్త ట్రెండ్. బీఈ, బీటెక్ లాంటి సాంకేతిక కోర్సులు చేసేవాళ్లకే పరిమితమైన సాఫ్ట్వేర్ రంగాన్ని నాన్ టెక్నికల్ విద్యార్థులకు అందుబాటులోకి తేవటమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ కోర్సును జీరోకోడ్ ఇన్నోవేషన్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ట్రిపుల్ ఐటీ కర్నూలు, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థలు ఈ సూపర్100 జీరో కోడ్ ఇన్నోవేషన్ కోర్సును నిర్వహించనుండగా, ఈ కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ -లాంచింగ్ ద్వారా నిర్వహించిన ప్రారంభోత్సవంలో ట్రిపుల్ ఐటీ బెంగళూరు వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ శఠగోపన్, కర్నూలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.
మొబైల్ యాప్‌ల రూపకల్పనే ధ్యేయం
కోర్సులో భాగంగా తొలుత 100 మందికి శిక్షణనిచ్చి ఉపాధి కల్పించటంతో పాటు, మరో వంద మందికి ఇంటర్న్‌షిప్ అందజేస్తారు. శిక్షణలో భాగంగా మొబై ల్, వెబ్, ఎంటర్ప్రైజెస్ గ్రేడ్ అప్లికేషన్లను రూపొందించేలా తర్ఫీదునిస్తారు. కోర్సు వ్యవధి 10రోజులే కావటం గమనార్హం. ఆసక్తిగలవారు www. zero co.de/super 100 ద్వారా ఈ నెల 23లోగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వివరాలకోసం 99085 00117, 1800 572 3650 నంబర్లను సంప్రదించాలి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

