Air Pollution | న్యూఢిల్లీ, నవంబర్ 12: గర్భధారణ సమయంలో, బాల్యం ప్రారంభంలో గాలి కాలుష్యానికి గురైతే, పిల్లలు ఆటిజం (మందబుద్ధి) బారినపడే ముప్పు ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. పీఎం 2.5 స్థాయి, నైట్రోజన్ ఆక్సైడ్లతో కూడిన సాధారణ గాలి కాలుష్యం పిల్లల్లో మెదడు ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం పరిశోధకులు కనుగొన్నారు.
‘జర్నల్ బ్రెయిన్ మెడిసిన్’ నివేదిక ప్రకారం, ప్రస్తుత కాలంలో మానసిక ఎదుగుదల లోపం కారణంగా చాలా మంది పిల్లలు అనేక వ్యాధుల బారినపడుతున్నారు. అందులో ‘ఆటిజం’ అనే సమస్య కూడా ఒకటి.