Poco X4 Pro 5G | బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలంటే.. బెస్ట్ ఆప్షన్ పోకో ఫోన్లు. జియోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో నుంచి ఎక్స్4 ప్రో 5జీ ఫోన్ తాజాగా భారత్‌లో లాంచ్ అయింది. పోకో ఎక్స్ సిరీస్ నుంచి లాంచ్ అయిన సరికొత్త ఫోన్ అది. గత సంవత్సరం లాంచ్ అయిన పోకో ఎక్స్3 ప్రోకు కొనసాగింపుగా ఎక్స్4 ప్రో 5జీ ఫోన్‌ను తాజాగా లాంచ్ చేశారు.
120 హెచ్‌జెడ్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్‌తో విడుదలైన ఈ ఫోన్ రియల్మీ 9 ప్రో 5జీ, మోటో జీ71 5జీ, వివో టీ1 5జీ ఫోన్‌కు పోటీగా వచ్చింది.
పోకో ఎక్స్4 ప్రో 5జీ ఫోన్ బేసిక్ మోడల్ 6 జీబీ ప్లస్ 64 జీబీ ధర రూ.18,999గా నిర్ణయించారు. 6 జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.19,999 కాగా.. 8 జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.21,999గా ఉంది. లేజర్ బ్లాక్, లేజర్ బ్లూ, పోకో ఎల్లో కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు.
లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. గత నెలలో జరిగిన ఎండబ్ల్యూసీ 2022 ఈవెంట్లోనే ఈ ఫోన్‌ను పోకో లాంచ్ చేసింది.
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13, 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 360 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, స్నాప్‌డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్, అడ్రెనో 619 జీపీయూ, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 108 ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.