ఇదివరకు ఎవరికైనా డబ్బులు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి గంటలు గంటలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. కానీ.. ఇప్పుడు చిటికెలో ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు ఆన్లైన్లో పంపించుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా డిజిటల్ వైపు చూస్తోంది. డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. చేతుల్లో డబ్బులు లేకపోయినా.. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఏదైనా చేయొచ్చు. ఏ వస్తువు అయినా కొనుగోలు చేయొచ్చు. అంతా డిజిటల్ వాలెట్స్ మహిమ.
ప్రస్తుతం మార్కెట్లో టాప్‌లో ఉన్న డిజిటల్ వాలెట్స్ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే. ఈ మూడు యాప్స్ మధ్య ప్రస్తుతం పోటీ విపరీతంగా నెలకొన్నది. ఈ మూడు యాప్స్ యూపీఐ పేమెంట్ ప్రక్రియను ఆఫర్ చేస్తున్నాయి.
గత నెల లావాదేవీలను చూస్తే.. ఫోన్‌పే 1653.19 మిలియన్ యూపీఐ లావాదేవీలతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే(1294.56 మిలియన్) ఉంది. మూడో స్థానంలో పేటీఎం(462.71 మిలియన్) ఉంది. పేటీఎం, ఫోన్‌పే వాలెట్ సర్వీసులను అందిస్తున్నాయి కానీ.. గూగుల్ పే ఎటువంటి వాలెట్ సర్వీసును అందించడం లేదు. గూగుల్ పే ద్వారా ఎటువంటి లావాదేవీ చేసినా డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.
అయితే.. ఎక్కువ ఆన్లైన్ బ్రాండ్స్‌తో టైఅప్ అయింది మాత్రం గూగుల్ పే. డిజిటల్ పేమెంట్ మోడ్‌ను మరింత సులభతరం చేసేందుకే గూగుల్ పే ఎక్కువ ఆన్లైన్ బ్రాండ్స్‌తో టైఅప్ అయింది. ఈ మూడు ప్లాట్‌ఫామ్‌లు ప్రతి లావాదేవీకి రివార్డ్స్‌ను అందిస్తున్నాయి.
సర్వీసుల విషయానికి వస్తే పేటీఎం, ఫోన్‌పేతో పోల్చితే.. గూగుల్ పే కొన్ని తక్కువ సర్వీసులను అందిస్తోంది. పేటీఎం, ఫోన్‌పే 11 ఇండియన్ భాషలను సపోర్ట్ చేస్తున్నాయి. గూగుల్ పే మాత్రం కొన్ని భాషలను మాత్రమే సపోర్ట్ చేస్తోంది.
డిజిటల్ పేమెంట్స్ విషయంలో దేన్నీ తక్కువ చేయలేము కానీ.. సర్వీసుల విషయంలోనే పేటీఎం, ఫోన్‌పే ముందున్నాయి. గూగుల్ పే చాలా లిమిటెడ్ సర్వీసులను అందిస్తుండటంతో పాటు వాలెట్‌ను కూడా అందిచడం లేదు. ఇటీవలే గూగుల్ పే.. ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్‌తో టైఅప్ అయింది. గూగుల్ పే యూజర్లకు హెల్త్ ఇన్సురెన్స్‌ను అందిస్తోంది.
యూజర్లు తమకు ఏ సర్వీసు కావాలో.. ఆ సర్వీస్‌ను ఏ యాప్ బెస్ట్‌గా అందిస్తుందో తెలుసుకొని ఆ యాప్‌ను ఉపయోగించవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే
JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో
Diwali Offer : దివాళీ బంపర్ ఆఫర్.. రూ.101 కే వివో ఫోన్.. త్వరపడండి
యూజర్ చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది? ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాల సంగతేంటి?
WhatsApp : వాట్సప్ బిజినెస్ అకౌంట్లో సరికొత్త ఫీచర్
ఈ స్క్విడ్ గేమ్ యాప్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి.. లేదంటే మీ ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లినట్టే