ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ జియోమీ.. తాజాగా రెడ్మీ నోట్ 11 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 11 సిరీస్‌లో భాగంగా రెడ్మీ నోట్ 11 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ మోడల్ ఫోన్లను చైనా విపణిలోకి విడుదల చేసింది. రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్‌లో సేమ్ స్పెసిఫికేషన్లే ఉన్నప్పటికీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లో మాత్రం తేడా ఉంటుంది.
రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ మోడల్ ఫోన్లో 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెడ్మీ నోట్ 11 ప్రోలో మాత్రం 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మూడు మోడల్స్‌లోనూ హోల్ పంచ్ డిస్ప్లే, మల్టిపుల్ కెమెరా ఆప్షన్లు ఉంటాయి.
రెడ్మీ నోట్ 11 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మన కరెన్సీలో రూ.14,000 కాగా 6జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ మోడల్స్ ధరలు వరుసగా రూ.16,400, రూ.18,700, రూ.21,100 గా నిర్ణయించారు.
రెడ్మీ నోట్ 11 ప్రో ఫోన్ 6 జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.18,700 కాగా 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.22,300, 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.24,500 గా నిర్ణయించారు.
రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 6 జీబీ ప్లస్ 128 జీబీ ఆప్షన్ ధర రూ.22,200 కాగా.. 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.24,500, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.26,900 గా నిర్ణయించారు.
6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్షిటీ 810 ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వరకు సపోర్ట్, డ్యుయల్ రేర్ కెమెరా, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ సెకండరీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఫీచర్లు రెడ్మీ నోట్ 11 5జీ ఫోన్లో ఉన్నాయి.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6.67 ఇంచ్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 360 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్, హోల్ పంచ్ డిజైన్, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్షిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వరకు సపోర్ట్, 108 ఎంపీ రేర్ కెమెరా లాంటి ఫీచర్లు రెడ్మీ నోట్ 11 ప్రోలో ఉన్నాయి.
4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్షిటీ 920 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వరకు సపోర్ట్, క్వాడ్ రేర్ కెమెరా సెటప్, 108 ఎంపీ కెమెరా, వైఫై 6, బ్లూటూత్ వీ 5.2, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ లాంటి ఫీచర్లు రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్‌లో ఉన్నాయి.
ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే విడుదలైంది. గ్లోబల్ మార్కెట్లోకి, భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. చైనాలో మాత్రం నవంబర్ 1 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో
Diwali Offer : దివాళీ బంపర్ ఆఫర్.. రూ.101 కే వివో ఫోన్.. త్వరపడండి
యూజర్ చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది? ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాల సంగతేంటి?
WhatsApp : వాట్సప్ బిజినెస్ అకౌంట్లో సరికొత్త ఫీచర్
ఈ స్క్విడ్ గేమ్ యాప్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి.. లేదంటే మీ ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లినట్టే